పద్మవ్యూహంలో చంద్రుడు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పద్మవ్యూహంలో చంద్రుడు

విజయవాడ, డిసెంబర్ 16, (way2newstv.com)
లుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇరికించడం తప్ప ఇరుక్కోవడం, ఇబ్బంది పడడం అన్నది ఆయన నాలుగు దశాబ్దాల చరిత్రలోనే లేదు. అటువంటి చంద్రబాబుకు ఇపుడు సరికొత్త సవాల్ ఎదురవుతోంది. చంద్రబాబు అనుభవాన్ని సైతం తీసెవేసేలా అధికార వైసీపీ రూపొందించిన పద్మవ్యూహంలో చంద్రబాబు చిక్కుకోబోతున్నారా అన్న సందేహాలు అందరికీ వ్యక్తం అవుతున్నాయి. నిజానికి శీతాకాల సమావేశాలు మొదలు అయినప్పటి నుంచే చంద్రబాబు ఎక్కడో అక్కడ దొరికిపోతూనే ఉన్నారు. స్పీకర్ చైర్ ని చూపించి బెదిరించినపుడే చంద్రబాబు మీద తగిన చర్యలు ఉంటాయని అంతా భావించారు. అయితే స్పీకర్ తమ్మినేని సీతారాం హుందాగా వ్యవహరించి తనను అన్నేసి మాటలు అన్నాక కూడా బాబుని క్షమించి వదిలేశారు. 
పద్మవ్యూహంలో చంద్రుడు

అసెంబ్లీ సమావేశాలను టీవీల్లో చూస్తున్న ప్రజలే ఏది మంచో తేల్చుకుంటారని అని చెప్పేసి చంద్రబాబుపై నేరుగా యాక్షన్ కి దిగలేదు.అటువంటి సీతారాం ముందుకు మరో సమస్య వచ్చిపడింది. అసెంబ్లీలో చీఫ్ మార్షల్స్ తో సహా అందరినీ దారుణంగా దుర్భాషలాడడమే కాకుండా. చేయి చేసుకున్నారన్న ఆరోపణలపైన చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలంటూ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇక్కడ విషయం ఏంటంటే వీడియో క్లిప్పింగులు సభలో ప్రదర్శించిన తరువాత స్పీకర్ సైతం దాంతో ఏకీభవించారు. పక్కాగా ఆధారాలు ఉన్నాయి, కాబట్టి చంద్రబాబు జరిగిన సంఘటలన మీద క్షమాపణలు చెబితే బాగుంటుందని సలహా ఇచ్చారు. అయితే చంద్రబాబు దానికి ససేమిరా అనడంతో తప్పనిపరిస్థితుల్లో దీని మీద తాను తగిన యాక్షన్ తీసుకుంటానని సభకు సీతారాం చెప్పేశారు. ఇపుడు స్పీకర్ ముందు బిగ్ టాస్క్ ఉంది. ఆయన చంద్రబాబు మీద చర్యలు తీసుకుంటారా లేదా అన్నది అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారుఇక చంద్రబాబు సభలో క్షమాపణలు చెప్పకపోవడానికి కారణం సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉందని అంటున్నారు. చంద్రబాబు ఏం చేశారన్నది వీడియో సాక్షిగా అంతా చూశారు, అధికార పక్షం చంద్రబాబుపై చర్యలకు డిమాండ్ చేస్తోంది. ఇపుడు చంద్రబాబు మీద చర్యలు కనుక తీసుకుంటే ఆయన దీన్ని సానుభూతిగా మార్చుకోవడానికి చూస్తారని అంటున్నారు. మరి అటువంటి అవకాశం వైసీపీ ఇస్తుందా అన్నది చూడాలి. స్పీకర్ తమ్మినేని సీతారాం చాలా భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సౌమ్యంగానే సమస్య పరిష్కారానికి చూస్తున్నారు. ఆయన తన తీర్పు కూడా చంద్రబాబు మీద యాక్షన్ దాకా పోకుండా గట్టిగా కామెంట్స్ చేసి వదిలేస్తారాఅన్నది కూడా చర్చగా ఉంది. అయితే వైసీపీ సర్కార్ మూడ్ మాత్రం బాబు మీద యాక్షన్ కచ్చితంగా ఉండాలని కోరుతోంది. చూడాలి ఏం జరుగుతుందో. ఏది ఏమైనా ఈసారి అసెంబ్లీ సెషన్ లో చంద్రబాబు వైసీపీకి బాగా దొరికిపోతున్నారనే అంతా అంటున్న విషయం.