చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా జనరల్ బిపిన్ రావత్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా జనరల్ బిపిన్ రావత్

న్యూఢిల్లీ, డిసెంబర్ 31 (way2newstv.com)
భారతదేశ తొలి త్రివిధ దళాధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)గా జనరల్ బిపిన్ రావత్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆర్మీ చీఫ్ పదవి విరమణ చేసిన ఆయన కొత్త బాధ్యతలు చేపట్టారు. సీడీఎస్గా నియమితులైన వెంటనే సైనికుల గౌరవ వందనం స్వీకరించారాయన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త పదవితో తనపై మరిన్ని బాధ్యతలు పెరిగాయని అన్నారు. 28వ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్న నవరాణేకు అభినందనలు తెలిపారు. కాగా, రావత్ మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. 
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా జనరల్ బిపిన్ రావత్

1978 డిసెంబర్లో ఆర్మీలో చేరిన బిపిన్ రావత్ 2017 జనవరి 1 నుంచి ఈ రోజు వరకు ఆర్మీ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించారు. బిపిన్ రావత్ స్థానంలో ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నవరాణే బాధ్యతలు చేపట్టనున్నారు.కాగా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ 65 సంవత్సరాలు వచ్చే వరకు ఆ పదవిలో కొనసాగవచ్చు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ త్రివిధ దళాలకు సంబంధించి రక్షణ శాఖ మంత్రికి ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తారు. ట్రైనింగ్, ఆపరేషన్స్, సహకార సేవలు, కమ్యూనికేషన్స్, రిపేర్, మెయింటెనెన్స్ అనే పలు రకాల వాటిలో త్రివిధ దళాలను సమన్వయం చేసుకుంటూ భారత రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడానికి కృషి చేస్తారు.