‘శ్రీనివాస్‌రెడ్డిని కూడా ఎన్‌కౌంటర్‌ చేయాలి’ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

‘శ్రీనివాస్‌రెడ్డిని కూడా ఎన్‌కౌంటర్‌ చేయాలి’

హాజీపూర్‌ బాధిత కుటుంబ సభ్యుల నిరసన
యాదాద్రి భువనగిరి డిసెంబర్ 7 (way2newstv.com):
 హాజీపూర్‌ వరస హత్యల నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని కూడా ఎన్‌కౌంటర్ చేయాలని హాజీపూర్‌ బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. వారంతా ‘శ్రీనివాస్‌రెడ్డిని ఎన్‌కౌంటర్‌ చేయాలి’ అనే నినాదాలు చేస్తూ.. హాజీపూర్‌లో నిరసన చేపట్టారు. షాద్‌నగర్‌లో ‘దిశ’పై అత్యాచారం, హత్య చేసిన నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు.. నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని కూడా ఎన్‌కౌంటర్‌ చేయాలన్నారు. 
‘శ్రీనివాస్‌రెడ్డిని కూడా ఎన్‌కౌంటర్‌ చేయాలి’

నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని హాజీపూర్‌ విద్యార్థులను దారుణంగా అత్యాచారం, హత్య చేసిన చేసిన విషయం తెలిసిందే. షాద్‌నగర్ ఘటన జరిగిన తొమ్మిది రోజుల్లోనే నిందితులను ఎన్‌కౌంటర్‌లో మట్టు బెట్టిన ప్రభుత్వం.. హాజీపూర్‌ ఘటనను ఎందుకు సీరియస్‌గా తీసుకోవడంలేదని ప్రశ్నించారు. దీంతో పాటు బొమ్మల రామారం పోలీసులను కలిసి శ్రీనివాస్‌రెడ్డిని ఎన్‌కౌంటర్‌ చేయాలని కోరారు. ఈ నిరసనలో గ్రామస్తులు, బాధత కుటుంబ సభ్యులు, హాజీపూర్‌ గ్రామ సర్పంచ్ తిరుమల కవిత వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.