న్యూఢిల్లీ డిసెంబర్ 23 (way2newstv.com)
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సోమవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ నిరసనలో పార్టీ చీఫ్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ సహా పెద్దసంఖ్యలో పార్టీ నేతలు, ఎంపీలు పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విద్యార్ధులు, యువతకు రాహుల్ పిలుపు ఇచ్చారు.
దేశాన్ని నాశనం చేసే శక్తులను అనుమతించరాదు: రాహుల్ గాంధీ పిలుపు
యువతను ఉద్దేశించి రాహుల్ ప్రస్తావిస్తూ ‘ప్రియమైన విద్యార్ధులు, యువకులూ..మీరు కేవలం భారతీయులమని భావిస్తే సరిపోదు..ఇలాంటి సంక్షోభ సమయంలో మీరు భారతీయులుగా చాటుతూ విద్వేషంతో దేశాన్ని నాశనం చేసే శక్తులను అనుమతించరాద’ని పిలుపు ఇచ్చారు. మోదీ, షా ద్వయం దేశంపై చిమ్ముతున్న విద్వేష విషాన్ని నిరసిస్తూ తమతో కలిసిరావాలని కోరుతూ రాహుల్ ట్వీట్ చేశారు.