సాంప్రదాయాలకు విరుద్ధంగా శాసనసభ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సాంప్రదాయాలకు విరుద్ధంగా శాసనసభ

అమరావతి డిసెంబర్ 10  (way2newstv.com)
అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడిన  టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దేశ చరిత్రలో ఏపీ అసెంబ్లీ జరిగిన తీరు విస్మయానికి గురి చేస్తుంది. సభ సాంప్రదాయాలకు విరుద్ధంగా సభ జరుగుతుంది. కొచ్చిన్ అవర్ జరుగుతున్నప్పుడు సభలో వంశీకి ఎలా అవకాశం ఇస్తారని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. మంగళవారం నాడు అసెంబ్లీ గేటు ఎదుట మీడియాతో టిడిపి ఎమ్మెల్యేలు మాట్లాడారు.  గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ సభలో మంత్రులు పచ్చి భూతులు తిడుతున్నారు. సభను అపహాస్యం చేస్తు స్పీకర్ వ్యవహరిస్తున్నారు. సభలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం  ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు అయి 6నెలలు అవుతున్న ఇంకా గత ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని అన్నారు. 
సాంప్రదాయాలకు విరుద్ధంగా శాసనసభ

ఇచ్చిన మాటని తప్పి సీఎం టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవలని చూస్తున్నారు. 151మంది ఎమ్మెల్యేలు వచ్చినా ఇంకా టీడీపీ సభ్యులను చేర్చుకోవాలని చూస్తున్నారు. కర్ణాటకలో ఇచ్చిన తీర్పును సమీక్ష చెయ్యమని స్పీకర్ ని కోరుతున్నామని అన్నారు.మరో టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ వంశీకి సభలో సీటు ఇవ్వమని అడగడానికి  క్వశ్చన్  అవర్ లో అడగడం ఏంటని ప్రశ్నించారు. వంశీకి  క్వశ్చన్ అవర్ లో సభలో చర్చ జరగకూడదని స్పీకర్ గతంలో చెప్పారు.  వంశీ  సిగ్గు లేకుండా  మాట్లాడుతున్నారు. హైదరాబాద్ ఉన్న భూములు,ఆస్తులు  కాపాడుకోవడానికి  టీడీపీ నుంచి వెళ్లారు. ఎన్టీఆర్, చంద్రబాబు,దయతో నువ్వు ఎమ్మెల్యే అయ్యావు.ఎమ్మేల్యేగా ఒడిపోతాననే భయంతో వంశీ రాజీనామా చేయడం లేదు. దమ్ము ఉంటే వంశీ రాజీనామా చెయ్యాలని అయన డిమాండ్ చేసారు.  టీడీపీ ఎమ్మేల్యేల ఆస్తులపైన,బిజినెస్ లపైన ప్రభుత్వం దాడులు చేస్తున్నది. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై రోజా ఎందుకు నోరు మెదపడం లేదు. గతంలో ప్రతి ఇంటికి వెళ్లి పరామర్శలు చేసిన  రోజా ఇప్పుడు నోరు మెదపడం లేదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలం అవడంపై మాట్లాడాలి అంటే వైసీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారని అయన అరోపించారు.