ఆటవీ కళాశాలలో ప్రారంభించిన సీఎం కేసీఆర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆటవీ కళాశాలలో ప్రారంభించిన సీఎం కేసీఆర్

సిద్దిపేట డిసెంబర్ 11  (way2newstv.com)
ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో పర్యటించారు.  . పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ములుగులో ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం పైలాన్ను ఆవిష్కరించారు అనంతరం కళాశాల ఆవరణలో సీఎం కేసీఆర్ మొక్క నాటారు. ఈ సందర్భంగా కళాశాలలోని సిబ్బంది, విద్యార్థులతో సీఎం ముచ్చటించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు హరీశ్రావు, ఈటల రాజేందర్ ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆటవీ కళాశాలలో ప్రారంభించిన సీఎం కేసీఆర్

తరువాత ఆయన గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసారు. అనంతరం గజ్వేల్ టౌన్లో వంద పడకల మాతా, శిశు ఆసుపత్రికి శంకుస్థాపన చేసారు. గజ్వేల్ పట్టణంలో సమీకృత మార్కెట్ను, సమీకృత కార్యాలయ కాంప్లెక్స్ను కూడా ఆయన ప్రారంభించారు.  తరువాత ముఖ్యమంత్రి స్థానికులనుద్దేశించి మాట్లాడారు. గజ్వేల్ ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. త్వరలో ఒక రోజంతా మీతోనే వుంటానని అన్నారు. అన్నీ సమస్యలను చర్చిద్దామని అన్నారు. నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలు  వుండకూడదన్నారు. పార్టీలు, పైరవీలు లేకుండానే డబల్ బెడ్ రూమ్ ఇళ్లు అందరికీ ఇస్తామని అన్నారు. జనవరి నెలలో గజ్వేల్ కు కాళేశ్వరం నీళ్లు వస్తాయని అన్నారు. ఇక్కడినుంచే హెల్త్ కార్డుల ప్రక్రియ ప్రాంరంభిస్తానని అయన అన్నారు.