గుంటూరు డిసెంబర్ 24 (way2newstv.com)
ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుతుందనే వింత వైఖరిని తెరపైకి తెచ్చారని, ఇలాంటి పిచ్చి పనులు సరికావని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. భయంతో బతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. జగన్ పాలనలో కక్షసాధింపు ధోరణి కనపడుతోందన్నారు.
జగన్ పాలనలో కక్షసాధింపు ధోరణి కనపడుతోంది: కన్నా
జగన్‌వి పిల్ల చేష్టలని ఆయన మండిపడ్డారు. ఇది రైతుల సమస్య కాదని.. రాజధాని సమస్య అని అన్నారు. కేంద్రం హెచ్చరించినా జగన్ నియంతృత్వ ధోరణితో వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.
Tags:
Andrapradeshnews