పోలీస్ కమిషనర్ పై ఉత్తం కుమార్ ఫైర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పోలీస్ కమిషనర్ పై ఉత్తం కుమార్ ఫైర్

హైద్రాబాద్, డిసెంబర్ 28, (way2newstv.com)
తిరంగా ర్యాలీకి పోలీసుల అనుమతి నిరాకరణపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. సీపీ అంజనీ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏజెంట్‌గా పనిచేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాల్సిన పోలీస్ ఉన్నతాధికారులు.. ప్రభుత్వానికి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అంజనీ కుమార్ క్యారెక్టర్ లేని వ్యక్తి అని, అవినీతిలో కూరుకుపోయాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనకు సీసీగా ఉండే అర్హత లేదని వ్యాఖ్యానించారు.జెండా ఆవిష్కరణకు మా కార్యకర్తలు వస్తే వారిని ఆపేస్తారా. 
పోలీస్ కమిషనర్ పై ఉత్తం కుమార్ ఫైర్

నీ సంగతి చూస్తా. ఇక్కడ ఉద్యోగం చేయడానికి వచ్చావు. ఉద్యోగం చేసుకొని సరిగ్గా వెళ్లిపో.’’ అంటూ హైదరాబాద్ సీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది చాలా సీరియస్‌గా తీసుకుంటాం. పునర్వభజన చట్టంలోని సెక్షన్ 8 కింద గవర్నర్‌కు హైదరాబాద్‌పై సంపూర్ణ అధికారాలు ఉన్నాయి. అహంకారం, పొగరుబోతు విధానాన్ని ఎలా అణచాలో తెలుసు. ఇప్పుడే గవర్నర్‌కు ఫోన్ చేశా. సీపీ అంజనీ కుమార్ అన్‌ఫిట్ అని చెప్పా. అతణ్ని వెంటనే పీకేయాలని సూచించా. పేరుకు ముందు కమిషనర్ ఐపీఎస్ అని తీసేసి, కేపీఎస్  అని పెట్టుకుంటే బెటర్.’’ అని ఉత్తమ్ మండిపడ్డారు. సోమవారం గవర్నర్‌ను కలిసి అంజనీకుమార్ తీరుపై ఫిర్యాదు చేస్తామని ఉత్తమ్ ప్రకటించారు.తర్వాత తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఫోన్‌ చేశారు. గాంధీ భవన్‌లో దీక్ష చేసుకుంటుంటే అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు వచ్చి కార్యకర్తలను అడ్డుకోవడానికి మీరెవరని ద్వజమెత్తారు. కార్యకర్తలను అరెస్ట్‌ చేయొద్దని సీపీకి చెప్పాలని కోరారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుమతిచ్చి, శాంతియుతంగా దీక్ష చేస్తున్న తమకు ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించారు.పోలీసుల ఆంక్షలు, అడ్డంకులను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్‌లోనే 24 గంటల సత్యాగ్రహ దీక్ష ప్రారంభించిన సంగతి తెలిసిందే. తమపై పోలీసుల తీరును పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తప్పుబట్టారు. మరోవైపు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజాద్రోహి అని కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్‌ మోసం చేశారని అన్నారు. మున్సిపాలిటీల్లో రిజర్వేషన్ తగ్గించి బీసీలను మోసం చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అహంకారం, అవినీతి పెరిగిపోయిందని పొన్నాల విమర్శించారు.పోలీసులు చెంచాలుగా మారిపోయారు కాంగ్రెస్ ఆవిర్భావ ర్యాలీకి పోలీసులు అనుమతించకపోవడంతో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత కాస్త పెరిగింది. తిరంగా ర్యాలీ నిర్వహించేందుకు బయటకు వస్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో అంతా ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్సీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేత షబ్బీర్ అలీ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. గాంధీ భవన్ ముందే నేతలంతా సత్యాగ్రహ దీక్ష చేస్తుండడంతో అంతా గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో భట్టి విక్రమార్క పోలీసులతో వాగ్వాదానికి దిగారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలకు కేసీఆర్ పాలనలో నష్టం జరుగుతోంది. మొత్తం 12 వేల గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. భవిష్యత్తులో వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించనున్నాం.’’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.‘శాంతియుతంగా చేసే సత్యాగ్రహ దీక్షను కూడా చూసి కేసీఆర్ భయపడుతున్నారు. కాంగ్రెస్ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి పెట్టింది. రాజ్యాంగాన్ని అందించింది. గాంధీ భవన్‌కు వచ్చే కాంగ్రెస్ కార్యకర్తలను కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఇది పోలీసు రాజ్యమా? లేక ప్రజాస్వామ్య రాజ్యమా అర్థం కావట్లేదు. అరెస్టులు చేయాలని ఇక్కడున్న పోలీసులు అధికారులకు కూడా కమిషనర్ ఆదేశాలిస్తున్నారు.’’ అని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.‘‘పోలీసులంతా ముఖ్యమంత్రికి చెంచాలుగా మారిపోయారు. ఇలా కాకుండా ఖాకీ దుస్తుల విలువ కాపాడుకోండని మేం కోరాం. అయినా పర్మిషన్ ఇవ్వకపోతే మేం సత్యాగ్రహ దీక్ష చేస్తున్నాం. మా కార్యకర్తలను మా ఆఫీసుకు రానివ్వకుండా చేస్తుండడంతో మేం ధర్నా చేస్తున్నాం.’’ అని షబ్బీర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.