కాంగ్రెస్, జేడీఎస్ జోరుమంతనాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాంగ్రెస్, జేడీఎస్ జోరుమంతనాలు

బెంగళూర్, డిసెంబర్ 7 (way2newstv.com)
కర్ణాటకలో ప్రతీకార రాజకీయాలు మొదలయ్యాయనే చెప్పాలి. మొన్నటి వరకూ జనతాదళ్ ఎస్ అగ్రనేతలు దేవెగౌడ, కుమారస్వామిలు బీజేపీకి సానుకూల ప్రకటనలు చేశారు. అప్పుడు ముఖ్యమంత్రి యడ్యూరప్ప తండ్రీకొడుకులను పొగడ్తలతో ముంచెత్తారు. జేడీఎస్ తమకు మద్దతిస్తామంటే తీసుకుంటామని, అది అంటరాని పార్టీ కూడా కాదని యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. కుమారస్వామి సమర్థత గల నేత అని కూడా యడ్యూరప్ప కొనియాడారు.అయితే మహారాష్ట్ర రాజకీయాలతో జేడీఎస్ నేతలు మనసు మార్చుకున్నారు. తిరిగి కాంగ్రెస్ కు దగ్గరయ్యేలా ప్రకటనలు చేశారు. ప్రస్తుతం జరిగిన పదిహేను అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకుంటే కాంగ్రెస్ మద్దతుతో తిరిగి సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేస్తామని దేవెగౌడ ప్రకటించారు. 
 కాంగ్రెస్, జేడీఎస్ జోరుమంతనాలు

అంతేకాకుండా యడ్యూరప్ప ప్రభుత్వం కుప్పకూలిపోతుందని కూడా దేవెగౌడ జోస్యం చెప్పారు. కాంగ్రెస్, జేడీఎస్ అగ్రనేతల రహస్య సమావేశాలు కూడా జోరుగా జరుగుతున్నాయి.తిరిగి జేడీఎస్ కాంగ్రెస్ నేతలపై వరస కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే కుమారస్వామి పైన ఫోన్ ట్యాపింగ్ కేసు రెడీ గా ఉంది. దీంతో పాటు కుమారస్వామి, సిద్ధరామయ్య లపై యడ్యూరప్ప సర్కార్ రాజద్రోహం కేసులు నమోదు చేసింది. కొంతకాలం జరిగిన లోక్ సభ ఎన్నికల సందర్భంగా వీరిద్దరూ ఆదాయపు పన్ను శాఖ దాడులకు వ్యతిరేకంగా ఆందోళన చేశారంటూ యడ్యూూరప్ప ప్రభుత్వం కేసు నమోదు చేసింది. న్యాయస్థానం ఆదేశంతో ఈ కేసు నమోదు చేసినా దీనిపై ఫిర్యాదు చేసింది బీజేపీ అనుకూలుడన్న ప్రచారం జరిగింది.తాజాగా దేవెగౌడ మనవడు సూరజ్ రేవణ్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. సూరజ్ రేవణ్ణ బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేశారంటూ హసన్ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. సూరజ్ రేవణ్ణపై కేసు నమోదు కూడా రాజకీయ కుట్రలో భాగమేనంటూ జనతాదళ్ ఎస్ ఆరోపిస్తోంది. మొత్తం మీద తమ ప్రభుత్వాన్ని ఎలాగైనా కాపాడుకోవాలన్న లక్ష్యంతోనే యడ్యూరప్ప ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తుందంటూ కాంగ్రెస్, జేడీఎస్ లు ఆరోపిస్తున్నాయి. ఈ నెల 9వ తేదీకి ముందు మరెన్ని కేసులు ఎంత మందిపై నమోదవుతాయనేది చూడాల్సి ఉంది.