అబ్బాయిలకు గౌరవించడం నేర్పండి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అబ్బాయిలకు గౌరవించడం నేర్పండి

యాదాద్రి భువనగిరి డిసెంబర్ 10, (way2newstv.com)
మహిళలపై జరుగుతున్న అత్యాచారాల ను దృష్టిలో పెట్టుకుని కాలేజ్ విద్యార్థి,విద్యార్థినుల కు అవగాహనా కార్యక్రమం ను జిల్లా కేంద్రం భువనగిరి లో షి ఫర్ హర్ ప్రోగ్రాం ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, జిల్లా కలెక్టర్ శ్రీమతి అమితా రాంచంద్రన్ ప్రారంభించారు.రామకృష్ణ పబ్లిక్ ప్రాసికూటర్ ఈ సమావేశంలో చట్టాలపై అవగాహన కల్పించారు.ముఖ్యంగా ఇంటర్,డిగ్రీ చదువుకునే పిల్లలు క్షణిక ఆవేశంలో ఏవైనా చిన్న తప్పటడుగు వేసినా చిన్న చిన్న తప్పు చేసినా అది జీవితంలో చాలా ప్రభావం చూపుతుంది అందుకే ఇలాంటి అవగాహన కల్పిస్తున్నామని మీకు ఎలాంటి హరాస్ మెంట్ జరిగినా ముందు తల్లి తండ్రులకు తెలపండని అన్నారు. అలాగే డైల్ 100 ఎలాంటి ఇబ్బంది కలిగినా ఫోన్ చేసినట్లయినా వెంటనే మీకు సహాయం అందించడానికి పోలీసులు వస్తారని తెలిపారు. 
అబ్బాయిలకు గౌరవించడం నేర్పండి

కలెక్టర్ అనితా రాంచంద్రన్  మాట్లాడుతూ చదువుకునే అమ్మాయిలు ఎలాంటి ఆకర్షణలకు లొంగవద్దని, దిశ సంఘటనలు చాలా తక్కువని కానీ ప్రేమ పేరుతో వంచించ బడి చంప బడ్డ కేసులు ఎక్కువని అన్నారు.రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ ఈ రోజుల్లో మహిళలు చదువులోనే కాదు అన్ని రంగాల్లో ముందుంటున్నారు.ఆడపిల్లల తల్లితండ్రులారా మీరు మీ అమ్మాయిలను బయటికి వెళ్లొద్దు,అక్కడికి వెళ్లొద్దు ఇక్కడికి వెళ్లొద్దు అని చెప్పకండి. మీరు మీ ఇంట్లో అబ్బాయికి చెప్పండి అమ్మాయిల పట్ల ఎలా ప్రవర్తించాలి. ఇతరులపట్ల ఎలాగౌరవంగా ఉండాలో నైతిక విలువలను నేర్పండి అప్పుడే దిశ లాంటి సంఘటనలు జరగవని అన్నారు. అలాగే అమ్మాయిల శాతం చాలా తక్కువగా ఉందని అందుకే స్పెషల్ డ్రైవ్ ద్వారా లింగనిర్దారణ పరీక్షలపై చట్టరీత్యా చర్య తీసుకుంటున్నామని తెలిపారు. దేశ రాజధానిలో జరిగిన నిర్భయ సంఘటనతో కఠినమైన చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చారని దీని ద్వారా అమ్మాయిలను వేధించే వారికిశిక్షలు పడతాయని చెప్పారు.అలాగే పోలీసులు మహిళల రక్షణకోరకు ఇప్పుడు వాట్స్ అప్ ను అలాగే ఒక ఆప్ ను తయారు చేశారని ఎవరన్నా ఎలాంటి అసభ్యకరంగా మెస్సేజ్ లు చేసినా వీడియో లు పెట్టినా మాకు వాట్స్ అప్ ద్వారా తెలిపినట్లయిన చర్య తీసుకుంటాం అలాగే మీ సమాచారం గోప్యంగా ఉంచుతాం అని ఎవరైనా ప్రయాణించే టప్పుడు మీ సమాచారం ఆప్ లో పెడితే మీ సమాచారం లొకేషన్ మాకు తెలుస్తుందని అన్నారు.