హైదరాబాద్ డిసెంబర్ 26 (way2newstv.com)
మునిసిపల్ ఎన్నికల ముందు కేసీఆర్ - ఒవైసీ మత రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ అరవింద్ ఆరోపించారు. సీఏఏతో ఈ దేశ ప్రజలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రకటన కూడా రాని ఎన్‌ఆర్సీపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ అండతో నిజామాబాద్‌లో సభ నిర్వహణకు ఎంఐఎం యత్నిస్తోందని అరవింద్ పేర్కొన్నారు.
ఓవైసీ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మ
ఎన్నికల కోడ్ ఉండగా ర్యాలీలు, సభలకు ఎలా అనుమతి ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఒవైసీ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మగా మారారని విమర్శించారు. తెలంగాణలో మతసామరస్యాన్ని ఫణంగా పెడుతున్నారని అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tags:
telangananews