హైదరాబాద్ డిసెంబర్ 17 (way2newstv.com)
కేటీఆర్ టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ కేటీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా మొక్కను బహూకరించారు. ఈ ఏడాది కాలంలో కేటీఆర్ పార్టీని మరింత పటిష్టపరిచారనీ, కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపారని ఆయనుద్దేశించి మంత్రి అన్నారు.
కేటీఆర్ కు సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు
కేటీఆర్ పార్టీ భాద్యతలు చేపట్టిన తర్వాత దాదాపు అన్ని ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించిందని ఆమె పేర్కొన్నారు. దీనంతటికీ ఆయన పరిపాలనా దక్షతే కారణమని మంత్రి ఈ సందర్భంగా ఆయనను ప్రశంసించారు. ఈ సందర్భంలో మంత్రితో పాటు ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్ తదితరులు ఉన్నారు.