స్థానిక ఎన్నికలకు సిద్దం కావాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

స్థానిక ఎన్నికలకు సిద్దం కావాలి

విజయవాడ డిసెంబర్ 27,  (way2newstv.com)
త్వరలో జరిగే బోయే లోకల్ బాడీ ఎన్నికలకు సర్వం సిద్ధం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె. విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు . శుక్రవారం రాజధాని అమరావతి నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు జడ్పీ సీఈవో లతో  త్వరలో జరగనున్న పంచాయితీ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఇప్పటినుంచి సన్నద్ధం కావాలని అని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. గ్రామ పంచాయతీ , జెడ్పిటిసి , ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, ప్రణాళికలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎలక్టోరల్ ప్రింటింగ్ వెంటనే కంప్లీట్ చేయాలి అన్నారు. 
స్థానిక ఎన్నికలకు సిద్దం కావాలి

ఈ పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ స్టాప్ ఎంతమంది అవసరం తదితర వివరాలను సేకరించాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలలో రిటర్నింగ్ ఆఫీసర్ ని జాయింట్ కలెక్టర్ లేదా జెడ్పి సీఈవో ను నియమించుకోవాలి అన్నారు. ఎవరైతే సీనియర్ అధికారో వారిని మాత్రమే రిటర్నింగ్ ఆఫీసర్ గా నియమించాలన్నారు. ఎంపీపీ, ఎంపీటీసీ ఎన్నికలకు స్పెషల్ ఆఫీసర్ గా ఎవరైతే పని చేస్తున్నారో వారిని ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియమించాలన్నారు. లోకల్ పరిస్థితుల బట్టి ఎక్కడ ఎటువంటి సమస్య లేకుండా ఎన్నికలు జరిగేందుకు ఇప్పటినుంచి చర్యలు చేపట్టాలన్నారు. వెబ్ కాస్టింగ్ లోకల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తో పని చేయించుకోవాలి అన్నారు. ప్రత్యేకంగా లాప్టాప్ మరియు ట్రైనింగ్ ఇచ్చి మానిటరింగ్ కంట్రోల్ ఏర్పాటు చేసుకోవాలన్నారు.అదేవిధంగా  పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికలలో రౌడీ షీటర్, ట్రబుల్ మేకర్స్ లను గుర్తించి వారిపై నిఘా పెట్టాలన్నారు. నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి నామినేషన్ కౌంటింగ్ తదితర వాటిపై పోలీస్ ప్రత్యేక బందోబస్తు అవసరమైతే సెంట్రల్ ఫోర్స్ ఏర్పాటు చేయాలన్నారు. బ్యాలెట్ బాక్సులు ఎంత అవసరము జిల్లాల వారీగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కలెక్టర్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్యాలెట్ బాక్సులు రిపేరులో ఉంటే వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. పోలింగ్ కేంద్రాల మౌలిక సదుపాయాలను పరిశీలించాలన్నారు. ఏవైనా మౌలిక సదుపాయాలు లేకపోతే వెంటనే కల్పించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు . రాబోయే ఎన్నికలలో సచివాలయ ఉద్యోగులు సైతం ఎన్నికల నిర్వహణ విధులకు సిద్ధం కావాలన్నారు . అదేవిధంగా ప్రింటింగ్ బ్యాలెట్ ప్రపోజల్ పెట్టి రేటు ఫిక్స్ చేయాలన్నారు. ఎక్కడైనా సమస్యాత్మకంగా  పోలింగ్ కేంద్రాలు ఉంటే ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ప్రధానంగా ఎస్సీ , ఎస్టీ, బిసి, ఉమెన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించేటప్పుడు జాగ్రత్తగా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. పోలింగ్ స్టేషన్లో వసతులు. మెటీరియల్స్, బ్యాలెట్ పేపర్లు, బాక్సులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.