జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన
పెద్దపల్లి డిసెంబర్ 27 (way2newstv.com)
పంచసూత్రాలను గ్రామంలో పూర్తి స్థాయిలో ప్రతి ఇంటిలో అమలు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. శుక్రవారం ఎలిగేడు మండలం బురహణమియపేట్ గ్రామంలో నిర్వహించిన స్వచ్చ శుక్రవారం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గోన్నారు. బురహణమియపేట్ గ్రామాన్ని కలెక్టర్ పర్యటిస్తూ పంచసుత్రాల అమలు ను పరిశీలించారు. గ్రామ ప్రజలతో కలెక్టర్ పంచసుత్రాల పై అవగాహన కల్పించారు. బురహణమియాపేట్ గ్రామంలో పూర్తి స్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని, వీటిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని అన్నారు. మన జిల్లాలో ప్రతి గ్రామంలో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం చేసి అవసరమైన సదుపాయాలు కల్పించామని అన్నారు.
పంచసూత్రాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలి
జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంటిలో ఇంకుడుగుంత నిర్మించామని , బురహణమియపేట్ గ్రామంలో పెండింగ్ లో ఉన్న ఇంకుడగుంత నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా కమ్యూనిటి ఇంకుడుగుంతలను పెద్ద సంఖ్యలో ఎర్పాటు చేసామని తెలిపారు. తడి చెత్త పోడి చెత్త, ప్లాస్టిక్ వేర్వేరుగా సేకరిస్తున్నామని, ప్రతి ఇంటిలో కాంపోస్ట్ పిట్ ఎర్పాటు చేయడంతో పాటు గ్రామంలో కాంపోస్ట్ షెడ్, ప్లాస్టిక్ సేకరణ యూనిట్ ఎర్పాటు చేసామని అన్నారు. గ్రామంలో ఉన్న ప్రజలకు, పిల్లలకు సైతం పంచసుత్రాల పై అవగాహన ఉందని అన్నారు. గ్రామంలో ప్రతి ఇంటిలో కిచెన్ గార్డెన్ ఎర్పాటు చేసుకొని, మహిళలు నెలసరి సమయాల్లో సబల శానిటరీ న్యాపకిన్ ను ఉపయోగించడం పట్ల అవగాహన కల్పిస్తు పంచసూత్రాలు పూర్తి స్థాయిలో పకడ్భందిగా అమలు చేయాలని అన్నారు. గ్రామ అభివృద్దిలో ప్రజాప్రతినిధులైన సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపిపి, ఎంపిటీసిలు మంచి సహకారం అందించారని , ఇదే స్పూర్తి కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. గ్రామంలో ప్రజలకు పంచసూత్రాల పై అవగాహన కల్పిస్తు ప్రభుత్వం ప్రారంభించిన 30 రోజుల కార్యచరణ స్పూర్తి కొనసాగించాలని తెలిపారు. జనవరి మాసం మొదటి వారం నుంచి గ్రామాలను ఫ్లైయింగ్ స్క్వాడ్లు ఆకస్మిక తనీఖీ నిర్వహించి స్థితిగతుల పై ముఖ్యమంత్రికి నివేదిస్తాయని, 30 రోజుల ప్రత్యేక కార్యచరణకు అనుగుణంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ అన్నారు. గ్రామ పంచాయతికి సంబంధించి విద్యుత్ బిల్లలు ప్రతి మాసం చెల్లించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలోని కెజిబివి విద్యాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు. కెజిబివి పాఠశాలను సందర్శించడానికి వచ్చిన కలెక్టర్ కు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పాఠశాలలో నాటిన మొక్కలను విద్యార్థులు పూర్తి స్థాయిలో సంరక్షించుకోవాలని కలెక్టర్ సూచించారు. బాలికలకు ఆత్మరక్షణ రంగంలో మంచి శిక్షణ అందించే దిశగా కళరిపయట్టు శిక్షణ అందిస్తున్నామని, దీనిని బాలికలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.జిల్లా పంచాయతి అధికారి వి.సుదర్శన్, స్వచ్చ భారత్ మీషన్ అధికారి రాఘవులు, గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, ప్రజలు, సంబంధిత అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.
Tags:
telangananews