సల్మాన్ తో స్టెప్పులేసిన వెంకీమామ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సల్మాన్ తో స్టెప్పులేసిన వెంకీమామ

హైద్రాబాద్, డిసెంబర్ 19 (way2newstv.com)
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ క్రిస్మస్ కానుకగా సల్మాన్ నటించిన ‘దబాంగ్ 3’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను భారీ ఎత్తున నిర్వహించారు.ఈ కార్యక్రమానికి చిత్ర నటీనటులు సల్మాన్ ఖాన్, సోనాక్షిసిన్హా, కిచ్చాసుదీప్, ప్రభుదేవా తదితరుల హాజరయ్యారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన రామ్ చరణ్, వెంకటేష్‌లు సల్మాన్‌కు స్వాగతం పలికారు.హైదరాబాద్ రావడం ఆనందంగా ఉంది. తెలుగు వారితో నాకు మంచి అనుబంధం ఉంది. మా చిత్ర బృందానికి ఘనంగా స్వాగతం లభించింది. మా సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొనడం ఆనందంగా ఉంది. అతన్ని చిన్నప్పటి నుండి చూస్తున్నా. ఆయన తండ్రి చిరంజీవి నాకు అత్యంత ఆప్తులు.నా పక్కనే ఉన్న మరో హీరో వెంకీమామ నా చిరకాల మిత్రుడు. 
సల్మాన్ తో స్టెప్పులేసిన వెంకీమామ

25 ఏళ్ల నుంచి మేం మంచి స్నేహితులం. కన్నడ హీరో సుదీప్ కిచ్చా ఈ సినిమాలో నా పాత్ర మరో స్థాయికి చేరుస్తాడు. దబాంగ్ 3 చిత్రం హిందీతోపాటు తెలుగులో కూడా విడుదలవుతుంది. చుల్‌బుల్ పాండే, రజ్జో పాత్రలు తెలుగు ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తాయి. ఈ సినిమాను తప్పకుండా ఆదరిస్తారని కోరుతున్నా.సల్మాన్ ఖాన్ పైనే నాకు ఉన్న ప్రేమను చెప్పడానికి ఈ ఒక్క ఈవెంట్ సరిపోదు. ఆయన నుండి నేను చాలా నేర్చుకున్నా. సూపర్ స్టార్స్ అంటే సల్మాన్, చిరంజీవి, వెంకటేష్, సుదీప్ మాదిరే ఉంటారు. వీళ్లందరో కామన్ పాయింట్ క్రమశిక్షణ. నెక్స్ట్ జనరేషన్‌కి వీళ్లే స్పూర్తి. ఈ చిత్ర దర్శకుడు ప్రభుదేవా సార్‌ని చిన్నప్పటి నుండి చూస్తున్నా.. ఆయన మల్టీటాలెంట్. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా’ అన్నారు రామ్ చరణ్.ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ‘దబాంగ్ 3’ తెలుగు వెర్షన్‌లో డ్రెస్సేస్తే పోలీస్.. తీసేస్తే గూండా అంటూ సల్మాన్ భాయ్ చెప్పే డైలాగ్స్ అదిరిపోయాయి. సల్మాన్ ఖాన్‌ను తెలుగు ప్రేక్షకులు ఎంతో అభిమానిస్తారు.. ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు వెంకటేష్.ఈ వేడుకలో సల్మాన్ ఖాన్ స్టేజ్‌పై అదిరిపోయే స్టెప్పులు వేశారు. వెంకటేష్, రామ్ చరణ్‌లతో సైతం స్టెప్పులు వేయించి అభిమానుల్లో ఉత్సాహం నింపారు సల్మాన్. ఈ ముగ్గురు స్టార్లు స్టేజ్‌ను షేర్ చేసుకుని స్టెప్పులేస్తుంటే.. అభిమానులు ఉత్సాహానికి అవధులు లేవు.