దిషా ఎన్ కౌంటర్ స్థలంలో టిఫిన్ సెంటర్ ఏర్పాటు!
షాద్ నగర్ డిసెంబర్ 9 (way2newstv.com)
ఆ ప్రదేశానికి వస్తున్న జనం చూసి ఏదో పర్యాటక ప్రాంతమో లేక జాతరో అనుకుంటే మీరు తప్పులు కాలు వేసినట్లే. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలో గల చటాన్ పల్లి గ్రామ శివారులో గత నెల 26వ తేదీన దిశ హత్య మరియు ఆ తరువాత జరిగిన ఎంకౌంటర్ ప్రాంతాన్ని చూడడానికి జనం తండోపతండాలుగా వస్తున్నారు హైవే కావడంతో ఒకరిని చూసి ఒకరు తమ వాహనాలను నిలిపి దిశ హత్య జరిగిన స్థలాన్ని మరియు అదేవిధంగా ఎన్ కౌంటర్ జరిగిన ఈ ప్రాంతంలో తమ సెల్ ఫోన్లలో వీడియోలు ఫోటోలు తీస్తూ సందడి చేస్తున్నారు.
ఎన్ కౌంటర్ స్థలమా పర్యాటక ప్రాంతమా..
ఎవరి గోల వారు చేస్తుంటే నేషనల్ హైవే జాతీయ రహదారి కావడంతో పోలీసులకు ట్రాఫిక్ నియంత్రణ పెద్ద సవాల్ గా మారింది ఈ రద్దీని ఆసరాగా చేసుకొని సందట్లో సడేమియా అన్నట్లు అక్కడ ఒక మొబైల్ టిఫిన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియతో చక్కర్లు కొడుతున్నాయి.