హైదరాబాద్ డిసెంబర్ 24 (way2newstv.com)
2014లో ఆయన ఒంటరిగా బయలు దేరాడు.. ఈ అమిత్ షాలు - అద్వానీలు - రాజ్ నాథ్ లు ఆయన వెంట లేరు. చాయ్ వాలాగా ప్రచారం చేసుకున్నారు. ఆశలు కల్పించి దేశానికి ప్రధాని అయ్యారు మోడీ. ఈ క్రమంలోనే బీజేపీ హిందుత్వ సిద్ధాంతాలను నాడు పక్కనపెట్టి ఒక చాయ్ వాలాను సామాన్యుడిని అంటూ ఓట్లు అభ్యర్థించాడు గెలిచాడు.. ప్రధాని అయ్యాడు.. మోడీని చూసే దేశంలోని ప్రజలు రెండు సార్లు బీజేపీకి అధికారం ఇచ్చారంటే అతిశయోక్తి కాదు.. తొలి ప్రభుత్వంలో నోట్ల రద్దు లాంటి ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే నిర్ణయం తీసుకున్నా మోడీతో సరితూగే ప్రతిపక్ష నేత లేకపోవడం.. రాహుల్ లోని చంచలత్వం చూసి మోడీకే మరోసారి పట్టం కట్టారు.అయితే మోడీ అంటే విజయాలు.. విజయాలు అంటే మోడీ.. ఇది పరిస్థితి ఉండేది.
జార్ఖండ్ ఓటమితో కమలనాథుల్లో కలవరం
ఆయన గుజరాత్ సీఎంగా అప్పుడెప్పుడో 2001లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన స్టామినాతో బీజేపీని గెలిపిస్తూనే వస్తున్నారు. ఒక్కసారి కూడా ఓడిపోలేదు. అసలు ఓటమి బాధ అనేది ఎలా ఉంటుందో మోడీకి తెలియదు..కానీ ఇప్పుడు తెలిసింది. దేశంలోని 5 రాష్ట్రాల్లో మోడీ ప్రచారం చేసినా బీజేపీ ఓడిపోయింది. కేవలం 12 నెలల్లోనే చత్తీస్ ఘడ్ - మధ్యప్రదేశ్ - రాజస్థాన్ - మహారాష్ట్ర - జార్ఖండ్ రాష్ట్రాలను బీజేపీ కోల్పోయింది. కర్ణాటకలో మాత్రమే పూర్తి స్థాయి సొంతంగా అధికారం చేపట్టింది. హర్యానాలో పొత్తుల సంసారం చేస్తోంది. తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోడీ ఏకంగా 9 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. తాజా ఫలితాల్లో మోడీ ప్రచారం చేసిన 9 నియోజకవర్గాల్లో కేవలం 3 సీట్లు మాత్రమే బీజేపీ గెలిచింది.అంటే మోడీ సక్సెస్ రేటు కేవలం 33శాతం మాత్రమే. దీన్ని బట్టి మోడీగారి ప్రభ తగ్గిపోయిందని అర్థమవుతోంది. అఖండ భారతాన్ని జయించిన నరేంద్రుడు ఇప్పుడు రాష్ట్రాల్లో ప్రచారం చేసినా గెలిపించలేకపోతున్న ధైన్యం చూసి కమలనాథుల్లో నిజంగా కలవరం మొదలైందట.. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి మోడీ ప్రభ ఇంకా తగ్గుతుందా? పెరుగుతుందా? అనేది..వేచి చూడాలి.