మెడికల్ కాలేజీల్లో ఫ్రీ డెలివరీలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మెడికల్ కాలేజీల్లో ఫ్రీ డెలివరీలు

వరంగల్, డిసెంబర్ 30, (way2newstv.com)
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు మెడికల్ కాలేజీ హాస్పిటళ్లలోనూ ఉచితంగా ప్రసవాలు చేయనున్నారు. వాటిల్లో ట్రీట్మెంట్ తీసుకునే బాలింతలకు కేసీఆర్ కిట్ పథకాన్ని కూడా వర్తింపజేయనున్నారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌  ప్రైవేటు మెడికల్ కాలేజీ మేనేజ్మెంట్లతో జరిపిన చర్చల్లో అంగీకారం కుదిరింది. కొద్దిరోజుల్లోనే ఇది అమల్లోకి రానుందని చర్చల్లో పాల్గొన్న ఉన్నతాధికారులు వెల్లడించారు.రాష్ట్రంలో కేసీఆర్ కిట్ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి సర్కారీ దవాఖానాలకు వచ్చే గర్భిణుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రసవాల సంఖ్య రెండింతలైంది. అయితే దవాఖానాల్లో సరైన వసతుల్లేక, సరిపడా డాక్టర్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పని ఒత్తిడి తట్టుకోలేక కొన్ని చోట్ల గైనకాలజిస్టులు ఉద్యోగాలు మానేసిన పరిస్థితి ఉంది. 
మెడికల్ కాలేజీల్లో ఫ్రీ డెలివరీలు

ఇదే సమయంలో డెలివరీల కోసం ప్రైవేటు టీచింగ్ హాస్పిటళ్లకు వెళ్లేవారి సంఖ్య బాగా తగ్గింది. ఆయా కాలేజీల్లో గైనకాలజీ, పీడియాట్రిక్ ఎండీ చదువుతున్నవారికి క్లినికల్ ప్రాక్టీస్ కు ఇబ్బంది మొదలైంది. ఈ నేపథ్యంలో ఇటు సర్కారీ హాస్పిటళ్లపై ఒత్తిడి తగ్గేలా, అటు టీచింగ్ హాస్పిటళ్ల ఇబ్బందులు తొలగేలా చర్చలు చేపట్టారు. టీచింగ్ హాస్పిటళ్లలో డెలివరీల కోసం ఇప్పటికే తక్కువగా ఫీజులు తీసుకుంటున్నారు. కొన్నింటిలో అయితే కేవలం మందుల బిల్లులు మాత్రమే వసూలు చేస్తున్నారు. కానీ వాటిలో డెలివరీ అయ్యే మహిళలకు కేసీఆర్ కిట్ వర్తించకపోవడంతో.. సర్కారీ హాస్పిటళ్లకు వస్తున్నారు. ఇప్పుడు డెలివరీలు ఉచితంగా చేయడం, కేసీఆర్ కిట్ వర్తింపజేయడంతో గర్భిణులు ప్రైవేటు టీచింగ్ హాస్పిటళ్లకు వెళ్లే అవకాశం ఉండనుంది.రాష్ట్రంలో 23 ప్రైవేటు టీచింగ్ హాస్పిటళ్లు ఉన్నాయి. వాటిల్లో మొత్తంగా 13 వేలకుపైగా బెడ్లు, అన్ని రకాల వసతులు, నిపుణులైన డాక్టర్లు ఉన్నారు. తాజా నిర్ణయంతో ఏటా సుమారు లక్ష మంది గర్భిణులు డెలివరీ కోసం ఆ హాస్పిటళ్లకు వెళ్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రైవేటు టీచింగ్ హాస్పిటళ్లలోనూ అమలు చేయాలని మేనేజ్మెంట్లు రెండేండ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అందుకు సర్కారు సానుకూలత వ్యక్తం చేసినా కొంత ఫీజు చెల్లించాలన్న మేనేజ్మెంట్ల విజ్ఞప్తిని తిరస్కరించింది. ఇప్పుడు ఉచితంగా డెలివరీలు చేసేందుకు ముందుకు రావడంతో ఓకే చెప్పింది. ఇటు సర్కారులో, అటు ప్రైవేటు టీచింగ్ హాస్పిటళ్లలో కేసీఆర్ కిట్ అమలు చేస్తే.. ప్రైవేటు హాస్పిటళ్లపై ప్రభావం పడే అవకాశం ఉందని వైద్య వర్గాలు చెప్తున్నాయి.టిబెటియన్ మెడిసిన్ ఎన్నో రోగాల నివారణలో మెరుగైన ఫలితాలను ఇస్తోందని, మన దేశంలోనూ దానికి గుర్తింపు ఉందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.