టీడీపీ ఆఫీసు కు తప్పని తిప్పలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టీడీపీ ఆఫీసు కు తప్పని తిప్పలు

గుంటూరు, డిసెంబర్ 23, (way2newstv.com)
గుంటూరు టీడీపీ నేత‌ల స్పంద‌న కోసం ప్రస్తుతం యావ‌త్ రాష్ట్రం ఎదురుచూస్తోంది. దీనికి రెండు ప్రధాన కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా అమ‌రావ‌తి రాజ‌ధానిలో టీడీపీ నాయ‌కులు భూములు త‌క్కువ ధ‌ర‌ల‌కు కొనుగోలు చేసి, అక్కడి రైతుల‌ను , ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల‌కు చెందిన ప్రజ‌ల‌ను మోసం చేశార‌ని ఇటీవ‌ల అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం స‌సాక్ష్యంగా వెల్లడించ‌డం. రెండు .. పార్టీ జాతీయ కార్యాలయం నిర్మాణం కోసం మంగ‌ళ‌గిరి స‌మీపంలోని ఆత్మకూరులో నిబంధ‌న‌ల‌కు వ్యతిరేకంగా భూమిని కేటాయించుకోవ‌డం . ఈ రెండు విష‌యాల్లోనూ టీడీపీ అడ్డంగా బుక్కయింద‌నేది ఇప్పుడు స‌ర్వత్రా వినిపి స్తున్న మాట‌.మ‌రి ఈ విష‌యాల్లో గుంటూరుకు చెందిన టీడీపీ నేత‌లు ఇప్పటి వ‌ర‌కు కూడా నోరు విప్పలేదు. 
టీడీపీ ఆఫీసు కు తప్పని తిప్పలు

ముఖ్యంగా పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే కొమ్మాల పాటి శ్రీధ‌ర్‌, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వంటి వారు త‌మ కుటుంబ స‌భ్యుల పేరుతో అమ‌రావ‌తిలో భారీ ఎత్తున ఎక‌రాల‌కు ఎకరాలు భూములు కొనుగోలు చేశార‌ని వైసీపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర‌నాథ్ రెడ్డి అసెంబ్లీలో గ‌ణాంకా ల‌తో పాటు వెల్లడించారు. దీనికి స‌మాధానం చెప్పుకోలేక చంద్రబాబు అండ్ కో తీవ్రమైన ఇబ్బంది ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ఇప్పటి వ‌ర‌కు వారు మీడియా ముందుకు కానీ, లేదా ఓ నోట్ రూపంలో కానీ దీనికి వివ‌ర‌ణ ఇచ్చుకునే ప్రయ‌త్నం చేయ‌లేదు.ఇక‌, రాజ‌ధాని ప్రాంతంలో టీడీపీ కార్యాల‌య నిర్మాణం కోసం భారీ ఎత్తున కుంట భూమిని నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా అప్పటి ప్రభుత్వం త‌న‌కు వీలుగా చ‌ట్టాల‌ను మార్చుకుని కేటాయించుకోవ‌డం పైనా కోర్టులో కేసులు న‌డుస్తున్నాయి. కానీ, ఈలోగానే ఇటీవ‌ల చంద్రబాబు పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభించేశారు. అయితే, ఆఫీస్ ప్రారంభించినంత మాత్రాన చేసిన త‌ప్పులు క‌ప్పిపుచ్చుకోలేర‌నేది ప్రభుత్వ వ‌ర్గాల మాట‌. ఇక ఇదే గుంటూరు జిల్లాకు చెందిన మ‌రో మాజీ మంత్రి సైతం త‌న బినామీల‌తో రాజ‌ధాని ప్రాంతంలో వంద‌లాది ఎక‌రాలు కొన్నట్టు టాక్‌.త‌మ‌పై ఆరోప‌ణ‌లు వ‌స్తోన్న నేప‌థ్యంలో గుంటూరుకు చెందిన నాయ‌కులు ఇప్పటికైనా తెర‌మీదికి వ‌చ్చి. అస‌లు జ‌రిగింది ఏంటి ? అని తెలుసుకునే ప్రయ‌త్నాలు గాని… చ‌ంద్రబాబును టార్గెట్ చేయ‌డంపై అధికార ప‌క్షానికి కౌంట‌ర్లు కూడా ఇవ్వడం లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు అత్యంత స‌న్నిహితంగా ఉన్న గుర‌జాల మాజీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు సైతం ఈ విష‌యంపై నోరు మెద‌ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇప్పుడు గుంటూరు నేత‌ల మౌనం పార్టీలో చ‌ర్చకు దారితీస్తోంది. చంద్రబాబు దీనిపై ఇప్పటికే సీరియ‌స్‌గా ఉన్నార‌ని స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.