నెల్లూరు డిసెంబర్ 26 (way2newstv.com)
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానాందేంద్ర సరస్వతి స్వామి వారిని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో కలిశారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్వామి వారిని దర్శించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు . 'స్వయంగా కలవటం ఆనందాన్ని కలిగించిందని' తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వామి వారు ఫిబ్రవరిలో జరిగే వార్షికోత్సవానికి రావాలని ఎంపీని ఆహ్వానించారు.
శారదాపీఠం ఉత్తరాధికారిని కలిసిన ఎంపీ ఆదాల
దీనికి ఆదాల ప్రభాకర్ రెడ్డి తప్పకుండా వస్తానని తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారు ఆదాల ప్రభాకర్ రెడ్డికి శాలువా కప్పి ప్రసాదాన్ని, ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో లో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, కోటేశ్వర్ రెడ్డి , సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Tags:
Andrapradeshnews