అమరావతి డిసెంబర్ 9 (way2newstv.com)
అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజే హోరెత్తి పోయాయి. క్వశ్చన్ అవర్ లోనే సభ హాట్ హాట్ గా సాగింది.. విద్యుత్ రంగం పై సభ్యులు అడిగిన ప్రశ్నల తో సభలో గందరగోళం జరిగింది. మరో వైపు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థి కరణ చట్టంపై అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు సాధారణంగా పెద్దగా ఆవేశాలు లేకుండా సాగుతుంది.కానీ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన మొదటి రోజే గందరగోళం ఏర్పడింది..అసెంబ్లీ ప్రారంభం అయిన వెంటనే విద్యుత్ రంగం పై సభ్యులు ప్రశ్న వేశారు. దీంతో అసెంబ్లీ లో పిపిఏ కొనుగోలుకు సంబంధించిన చర్చ జరిగింది. దీనికి మంత్రి బుగ్గన వివరణ ఇచ్చారు.
హోరెత్తిన శాసనసభ
బుగ్గన మాట్లాడిన తర్వాత తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని బాబు కోరారు. కానీ క్వశ్చన్ అవర్ కాబట్టి దానికే పరిమితం అవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. అయిన కూడా బాబు మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు..దాంతో పాటు సభలో అరాచక శక్తులు ఉన్నాయన్నారు.దీంతో గందరగోళం ఏర్పడింది... మాజీ మంత్రి ఆనం మాట్లాడే ప్రయత్నం చెయ్యడంతో చంద్రబాబు ఆయన వద్దకు దూకుడుగా వెళ్లారని వైసిపీ సభ్యులు ఆందోళన చేశారు...దీంతో మరింత గందరగోళం పరిస్థితి ఏర్పడింది.తర్వాత సభలో ఏపీ పునర్వ్యవస్తి కరణకు సంబంధించి చర్చ జరిగింది. బాబు ఐదేళ్లు సమయం ఉన్న దొంగచాటుగా హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారన్నారు వైసీపీ సభ్యులు. ప్రత్యేక హోదా తేవడం లో గత ప్రభుత్వం విఫలం అయిందన్నారు..వైసీపీకి 23 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి ప్రత్యేక హోదా తేవలన్నారు మాజీ మంత్రి అచ్చం నాయుడు.అసెంబ్లీ మొదటి సారి వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం జరిగింది...7 వర్కింగ్ డేస్ లో అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు..ఈ నెల 17 వరకు అసెంబ్లీ జరగనుంది.