పాన్ కార్డు , ఆధార్ కార్డు లకు గడువు పెంపు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పాన్ కార్డు , ఆధార్ కార్డు లకు గడువు పెంపు

హైద్రాబాద్, డిసెంబర్ 31 (way2newstv.com)
పాన్ కార్డు ఉందా? అలాగే ఆధార్ కార్డు కూడా కలిగి ఉన్నారా? అయితే మీకు తీపికబురు అందింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా పాన్, ఆధార్ కార్డుల అనుసంధాన గడువును మరింత పొడిగించింది. దీంతో ఇప్పటికీ కూడా రెండింటినీ లింక్ చేసుకొనివారికి ఇది శుభవార్త అని చెప్పాలి. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఆధార్, పాన్ కార్డులను కచ్చితగా లింక్ చేసుకోవాలి.ఆధార్ కార్డు, పాన్ నెంబర్ అనుసంధానానికి డిసెంబర్ 31 డెడ్‌లైన్. అంటే ఈరోజే లాస్ట్. అయితే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బర్డు  తాజాగా ఈ గడువును మరింత పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి చివరి వరకు లింక్ చేసుకోవడానికి గుడువు ఇచ్చింది.‘ఆధార్ కార్డుతో పాన్ నెంబర్ లింక్ చేసుకోవడానికి గడువు డిసెంబర్ 31గా ఉంది. 
పాన్ కార్డు , ఆధార్ కార్డు లకు గడువు పెంపు

అయితే ఇప్పుడు ఈ డెడ్‌లైన్‌ను 2020 మార్చి 31 వరకు పొడిగించాం. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 138ఏఏలోని సబ్‌సెక్షన్ 2 ప్రకారం ఆధార్, పాన్ కార్డును కచ్చితంగా అనుసంధానం చేసుకోవాలి’ అని సీబీడీటీ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేసింది.సీబీడీటీ ఆధార్, పాన్ అనుసంధాన గడువును పొడిగించడం ఇది వరుసగా 8వ సారి కావడం గమనార్హం. గతేడాది సెప్టెంబర్ నెలలో సుప్రీం కోర్టు.. కేంద్ర ప్రభుత్వపు ఆధార్ కార్డు రాజ్యంగబద్ధంగా అర్హత కలిగి ఉందని పేర్కొంది. దీంతో కేంద్రం ఆధార్, పాన్ నెంబర్లను లింక్ చేసుకోవాలి కోరుతూ వస్తోంది.పాన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు పొందటానికి అర్హులు. అదేసమయంలో వారి ఆధార్ నెంబర్‌ను కచ్చితంగా ట్యాక్స్ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డును యూఐడీఏఐ జారీ చేస్తుంది. ఇకపోతే పాన్ కార్డును ఇన్‌‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అందజేస్తుంది. ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పాలసీలను సీబీడీటీ రూపొందిస్తుంది.