హైద్రాబాద్, డిసెంబర్ 20, (way2newstv.com)
సంక్రాంతి పండగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ ఓ ప్రకటనలో తెలిపారు. కాచిగూడ–శ్రీకాకుళం(07016) స్పెషల్ ట్రైన్ జనవరి 7,14,21,28, ఫిబ్రవరి 4,11,18,25, మార్చి 3,10,17,24,31 తేదీల్లో సాయంత్రం 6.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు శ్రీకాకుళం చేరుతుంది.
సంక్రాంతికి స్పెషల్ రైళ్లు
తిరుపతి–కాచిగూడ (07479) స్పెషల్ ట్రైన్ జనవరి 9, 16, 23, 30, ఫిబ్రవరి 6, 13, 20, 27, మార్చి 5, 12, 19, 26, ఏప్రిల్ 2 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కు కాచిగూడ చేరుకుంటుంది. కాచిగూడ– శ్రీకాకుళం (07148/ 07147) స్పెషల్ ట్రైన్ జనవరి 5, 19, 26, ఫిబ్రవరి 2, 9, 16, 23, మార్చి 1, 8, 15, 22, 29 తేదీల్లో సాయంత్రం 6.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.55కు శ్రీకాకుళం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 6, 13, 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24, మార్చి 2, 9, 16, 23, 30 తేదీల్లో సాయంత్రం 5.15 కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 కు కాచిగూడ చేరుకుంటుంది