చెన్నై డిసెంబర్ 12, (way2newstv.com):
ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1939లో విజయనగరంలో ఆయన జన్మించారు. 250కి పైగా పలు చిత్రాల్లో నటించారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యం పాలైయ్యారు. దాంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించిన గొల్లపూడి మారుతీరావు రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాతగా రాణించారు.
గొల్లపూడి కన్నుమూత
గొల్లపూడి మారుతీరావు నటించిన తొలి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య(1982) కాగా గొల్లపూడి నటించిన చివరి చిత్రం జోడి(ఆది సాయికుమార్). 42 ఏళ్ల వయస్సులో మొదటి సినిమాలో నటించిన గొల్లపూడి మూడున్నర దశాబ్దాలకుపైగా సినీరంగంలో ఎన్నో పాత్రలు పోషించి విభిన్నమైన నటుడిగా పేరు సాధించారు. సుమారు 290కిపైగా చిత్రాల్లో నటించిన గొల్లపూడి మారుతీరావు ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా, హాస్యనటుడిగా నటించి మెప్పించారు. మూడున్నర దశాబ్దాలకుపైగా తెలుగు సినీ రంగానికి ఎన్నో సేవలు అందించారు. సుమారు 290కిపైగా చిత్రాల్లో నటించిన గొల్లపూడి మారుతీరావు.. ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా, హాస్యనటుడిగా సినిమాలకు నిండుదనం తీసుకువచ్చారు. 12 నవలలు, 4 కథా సంపుటాలు, 3 పిల్లల కథలు అయన రాసారు.