పిల్లలో నా రక్తం.... మీకు సైన్స్ తెలియదా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పిల్లలో నా రక్తం.... మీకు సైన్స్ తెలియదా

నెట్ జన్లకు రేణు సమాధానం
ముంబై, డిసెంబర్ 30, (way2newstv.com)
మాజీ భర్త పవన్ కళ్యాణ్‌ మాటెత్తగానే తెగ ఫీలైపోయారు నటి రేణూ దేశాయ్. పవన్‌తో విడిపోయి ప్రస్తుతం రేణూ తన ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి పుణెలో ఉంటున్నారు. రోజూ తన పిల్లలకు సంబంధించిన ఫొటోలను రేణు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూనే ఉంటారు. అయితే ఇటీవల రేణు పోస్ట్ చేసిన ఫొటోకు ఓ నెటిజన్ ఇచ్చిన కామెంట్ రేణూకు నచ్చలేదు.అకీరా తన చెల్లి ఆద్యను ఎత్తుకున్న ఫొటోను రేణు ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ల పోస్ట్ చేశారు. దీనికి క్యాప్షన్‌గా.. ‘1 2 3 అని లెక్కపెట్టేలోపు నేను నీ ముందు ఉంటా. ఆద్య, అకీరా క్రేజీ ఫెల్లోస్.. కానీ వారిద్దరూ నా సొంతం’ అని పేర్కొన్నారు. ఈ ఫొటోకి సాయి పవన్ అనే నెటిజన్.. ‘ఎంతైనా పవన్ రక్తం కదా..’ అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ రేణూకి నచ్చలేదు.సాయి పవన్ చేసిన కామెంట్‌కు రేణు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. 

పిల్లలో నా రక్తం.... మీకు సైన్స్ తెలియదా

‘టెక్నికల్‌గా చెప్పాలంటే వారిద్దరిలో ప్రవహించేది నా రక్తం. మీకు సైన్స్ తెలిస్తే ఈ మాటకు అర్థం తెలుస్తుంది’ అని సమాధానం ఇచ్చారు. రేణు ఇచ్చిన ఈ రిప్లైకి చాలా మంది హ్యాట్సాఫ్ చెప్పారు.అయితే రేణు చేసిన కామెంట్‌పై చరణ్ అనే నెటిజన్ కామెంట్ చేస్తూ.. ‘ఫ్యాన్స్‌తో ఇంత దురుసుగా ప్రవర్తించకండి మేడమ్’ అని సలహా ఇచ్చాడు. ఇందుకు రేణు సమాధానమిస్తూ.. ‘అంటే ఫ్యాన్స్ నాలో ఉన్న అమ్మతనం గురించి దురుసుగా మాట్లాడొచ్చా’ అని ప్రశ్నించారు. అంతేకాదు ఏ ఆడపిల్లకైనా అన్న ప్రేమ దక్కాల్సిందే అని ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు రేణు రిప్లై ఇస్తూ.. ‘చెప్పాలంటే సోదరి ప్రేమ చాలా అవసరం. అకీరాకు అది కావాల్సినంత దక్కింది’ అని సమాధానం ఇచ్చారు.అయితే రేణూ దేశాయ్ ఎప్పుడు అకీరా నందన్‌కు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేసినా పవన్ కళ్యాణ్ ఫ్యా్న్స్ ‘జూనియర్ పవర్‌స్టార్’ అంటూ తెగ కామెంట్స్ చేసేవాళ్లు. కొన్నాళ్ల పాటు ఈ కామెంట్స్‌పై రేణూ ఏమీ స్పందించలేదు. కానీ ఒకానొక సందర్భంలో అకీరాపై అంచనాలు ఎక్కువ అయిపోతుండడంతో రేణు నెటిజన్స్‌కు దీటుగా సమాధానం ఇచ్చారు. ‘అకీరాను పవన్ కళ్యాణ్‌తో పోల్చద్దు. జూనియర్ పవర్‌స్టార్ అనద్దు. అది అకీరాకు నచ్చదు’ అని తెలిపారు.పవన్‌తో విడిపోయాక రేణూ దేశాయ్ చాలా కాలం పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆమె జీవితంలో తనకంటూ మరో తోడు ఉండాలని నిర్ణయించుకున్నారు. ఓ వ్యాపారవేత్తను ప్రేమించానని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్ని నెలల క్రితం ప్రకటించారు. అతనితో రేణూకి నిశ్చితార్థం కూడా అయిపోయింది. అయితే ఇప్పటివరకు రేణు నుంచి ఎలాంటి పెళ్లి మాట రాలేదు. దాంతో పెళ్లి ఆగిపోయిందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి.