జీవీఎంసీ కోసమే... హడావిడా.. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జీవీఎంసీ కోసమే... హడావిడా..

విశాఖపట్టణం, డిసెంబర్ 27, (way2newstv.com)
వైసీపీకి విశాఖలో అసలైన బలం ఏంటో చెప్పే కీలక ఘట్టం రెండు నెలల్లో ఆవిష్కృతం కాబోతోంది. మహా విశాఖ నగర పాలన సంస్థకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరిపించాలని ఇప్పటికిపుడు వైసీపీ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లుగా భోగట్టా. నిజానికి జీవీఎంసీలోని వార్డులను వందకు పెంచాలన్నది నిన్నటి వరకూ వినిపించిన మాట. అయితే అలా చేయాలంటే చట్ట సవరణ అవసరం. ఆ తతంగం పూర్తి అయ్యేసరికి పుణ్యకాలం మించుతుంది. అప్పటికి వైసీపీ సర్కార్ పట్ల వ్యతిరేకత పెరిగినా పెరగవచ్చు. అందుకే తొందరలోనే జీవీఎంసీఎ ఎన్నికలకు వైసీపీ రెడీ అవుతోందని వినిపిస్తోంది.విశాఖ నగరం చిత్రమైనది. ఇక్కడ ప్రజలు మొదటి నుంచి కాంగ్రెస్ కి పట్టం కడుతూ వచ్చారు. 
జీవీఎంసీ కోసమే... హడావిడా..

అనేక సార్లు జీవీఎంసీ కి ఎన్నికలు జరిగితే ఒకే ఒక్కసారి మాత్రమే టీడీపీ గెలిచింది. ఇక కాంగ్రెస్ ని గెలిపించడం వెనక టీడీపీ పట్ల ఉన్న వ్యతిరేకతతో పాటు, ఆ పార్టీ సంకుచిత ప్రాంతీయ రాజకీయాలు మరో కారణం. అయితే కాంగ్రెస్ కనుమరుగు అయిన తరువాత నుంచి టీడీపీ వైపు జనం మొగ్గుచూపుతున్నారు. పోటీలో ఉన్న వైసీపీ కంటే టీడీపీ బెటర్ అన్నది ఇప్పటికీ జనాభిప్రాయంగా ఉంది. వైసీపీ మీద అనేక రకాలైన ఆరోపణలు నిత్యం పత్రికల్లో చూసిన జనం ఆ పార్టీని అక్కున చేర్చుకొవడానికి ఇష్టపడడంలేదని అంటారు.విశాఖ నగరం తీసుకుంటే చదువుకున్న వారు ఎక్కువ. ఇక్కడ ఉద్యోగస్తులు కూడా పెద్ద శాతం ఉంటారు. అలాగే బ్రాహ్మణులు, ఇతర ఉన్నత వర్గాల వారి ఓట్లు కీలకంగా ఉంటాయి. వారంతా ఎక్కువగా మీడియాను అనుసరిస్తారు. వారికి అక్కడ వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగానే తన అభిప్రాయాలను మార్చుకుంటారు. వైసీపీ విషయానికి వస్తే జగన్ మీద అవినీతి ఆరోపణలపైన కోర్టులో కేసులు ఉన్నాయి. అవి నిరూపితం కాలేదు కానీ జనంలో మాత్రం కొంత వ్యతిరేకత దీనివల్లనే ఉందని పలు సర్వేలు అనాడే వెల్లడి చేశాయి.మరో వైపు టీడీపీ నేతలు చేసే ప్రచారానికి నగర ప్రజానీకం విపరీతంగా ప్రభావితం అయ్యారు. మొదటి నుంచి ఇక్కడ జనం ప్రశాంతతను కోరుకుంటారు. దాంతో సీమ రాజకీయం పంచాయతీలు అంటూ టీడీపీ నానా యాగీ చేస్తే దాన్ని నమ్మి 2014 ఎన్నికల్లో జగన్ తల్లి విజయమ్మను లోక్ సభ ఎన్నికల్లో ఓడించారు. ఇక 2019 ఎన్నికల్లో కూడా సిటీలో ఉన్న నాలుగు సీట్లు వైసీపీకి దక్కలేదు. ఇందులో రెండు చోట్ల పాతిక వేల పై చిలుకు మెజారిటీ టీడీపీకి వచ్చిందంటే వైసీపీకి పెద్దగా ఇక్కడ పట్టులేదని అర్ధమవుతోంది.ఇపుడు విశాఖను అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా చేస్తానని జగన్ సర్కార్ అంటోంది. దాని మీద నగర వాసుల నుంచి మిశ్రమ స్పందన ఉంది. అయితే జగన్ సర్కార్ ఆరు నెలల్లో చేపడుతున్న సంక్షేమ పధకలు, పాలనలో అవినీతి లేకపోవడం, ఒక స్పష్టమైన వైఖరితో వైసీపీ సర్కార్ ముందుకు సాగడం వంటివి సానుకూల అంశాలుగా ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉన్నా కూడా సిటీ రాజకీయాల్లో వైసీపీకి ఈ రోజుకూ పట్టు పెద్దగా లేదు. అయితే దాన్ని అధిగమించేందుకు పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి నేతలను తీసుకుంటారని అంటున్నారు రాజధాని ప్రకటన తరువాత సిటీలో పరిస్థితులు ఎంతవరకూ మారాయి. అవి వైసీపీకి ఎలా అనుకూలించాయన్నది జీవీఎంసీ ఎన్నికల్లో తేలనుంది. మంచి మెజారిటీతో వైసీపీ గెలిస్తే మాత్రం విశాఖ అభివృధ్ధికి సంబంధించి ప్రభుత్వం దూకుడు మామూలుగా ఉండదని అంటున్నారు.