ఆర్టీసీ ఉద్యోగులకు సంచార బయో టాయిలెట్లు

హైదరాబాద్ డిసెంబర్ 27 (way2newstv.com)
: ఉద్యోగులకు టాయ్‌లెట్స్‌, దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులను ఏర్పాటుచేయాలని ప్రగతిభవన్‌లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు డిపోల్లో తాత్కాలిక ప్రాతిపదికన టాయిలెట్లు ఏర్పాటయ్యాయి.
ఆర్టీసీ  ఉద్యోగులకు సంచార బయో టాయిలెట్లు

ఉద్యోగులకు ఛేంజ్‌ ఓవర్‌ పాయింట్‌లలో సంచార బయో టాయిలెట్లను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. పురుషులు, స్త్రీలకు వేర్వేరుగా పాత బస్సుల్లో టాయిలెట్లను ఏర్పాటుచేశారు.నగరంలో తొమ్మిది చేంజ్‌ ఓవర్‌ పాయింట్లలో మొదట వీటిని ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులతో నిర్వహించిన వనభోజనాల సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వీటిని ప్రారంభించారు
Previous Post Next Post