తెలంగాణ గడ్జ మీద కాంగ్రెస్ , బీజేపీలకు స్థానం లేదు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణ గడ్జ మీద కాంగ్రెస్ , బీజేపీలకు స్థానం లేదు

ఆర్థిక మంత్రి హరీష్ రావు.
సంగారెడ్డి డిసెంబర్ 14(way2newstv.com)  
తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్, బీజేపీలకు స్థానంలేదు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోసంగారెడ్డి లోని ఎనిమిది మున్సిపాలిటీలు క్లీన్ స్వీప్ చేయాలి. మున్సిపల్ ఎన్నికలలో గులాబీ జేండానే ఎగరాలని ఆర్ధిక మంత్రి హరీష్ రెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కంది మండలం కాంగ్రెస్ సీనియర్ నేత రామ కృష్ణా రెడ్డి, సర్పంచి విమల వీరేశం తెరాసలో  చేరారు. పార్డీ కండువా కప్పి ఇరువురిని మంత్రి  ఆహ్వానించారు. మంత్రి మాట్లాడుతూ బీజేపీ , కాంగ్రెస్ దొందూ దొందే. మాటలుఎక్కువ చేతలుతక్కువ. ఈరెండు పార్టీలలో ఏది గెలిచినా సంగారెడ్డికి ఒరిగేదేమి లేదు. 
తెలంగాణ గడ్జ మీద కాంగ్రెస్ , బీజేపీలకు స్థానం లేదు

ఎనిమిది మున్సిపాలిటీలు గెల్చుకునేందుకు అందరూ కలిసి పని చేయాలి. అభివృద్ధి తెరాస, కేసీఆర్ వల్లేసాధ్యమని అన్నారు. దేశానికి తెలంగాణ రాష్ట్రంరోల్ మోడల్ గా నిలిచింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు తెలంగాణ అభివృద్ధిని చూసివెళ్తున్నాయి. మిషన్ భగీరథ ను కాపీ కొడుతున్నాయి. కాళేశ్వరం మెగా ప్రాజెక్టును దేశమంతా చూస్తోంది. కంది మండలాన్ని అన్ని విదాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. నాలుగు వరుసల రోడ్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కాలేజ్ వంటివి , ఎంపీడీవో, ఎమ్మార్వో భవనాలు పూర్తిచేస్తాం. తాగు నీటిసమస్యను పరిష్కరిస్తాం. వంద డబుల్ బెడ్ రూంలు పూర్తవుతున్నాయి. కేసీఆర్ ఆశీస్సులతో మరిన్ని నిర్మిస్తామన్నారు. పెన్షన్ పెంచింది తెరాసానే. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆడపిల్లల పెళ్లి చేస్తోంది తెరాసానే.  ప్రభుత్వమే గర్బిణీ స్త్రీలను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి చేరుస్తోంది. కేసీఆర్ కిట్, 12  వేలరూపాయలు ఇచ్చి ఇంటికి పంపుతోంది తెరాసానే. కాంగ్రెస్హయాంలో సంగారెడ్డి పరిశ్రమలు మూత పడితే, మేం 24  గంటలకరెంట్ ఇచ్చి నడిపుతున్న చరిత్ర మాది. సంగారెడ్డి, కంది మండలాలకు త్వరలోనేే గోదావరి జలాలు వస్తాయి. ఇంటింటికి స్వచ్ఛమైన తాగు నీరు అందిస్తాని మంత్రి అన్నారు.