జనాభా లెక్కలకు అంతా సిద్ధం

నెల్లూరు, డిసెంబర్ 16, (way2newstv.com)
ప్రతి పదేళ్లకు ఓసారి జనాభా లెక్కలు తయారు చేస్తారు. 2021 జనాభా లెక్కల సేకరణకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పటివరకు వివరాల సేకరణ, నమోదు మాన్యువల్‌గానే సాగింది. ఈసారి కొత్తగా మూడు యాప్‌లు వినియోగిస్తున్నారు. కేవలం యాప్‌లనే నమ్ముకుంటే సాంకేతిక అవరోధాలు ఉత్పన్నమైతే మొదటికే మోసం వచ్చే వస్తుంది. అందుకే యాప్‌లతోపాటు మాన్యువల్‌గా కూడా వివరాలు సేకరించి నమోదు చేయనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం, అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం, గుంటూరుజిల్లా నరసరావుపేటలో ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 30 వరకు ప్రయోగాత్మకంగా పాపులేషన్‌ సెన్సెస్‌ నిర్వహించారు. సత్ఫలితాలు రావడంతో రాష్ట్రమంతటా నిర్వహించాలని నిర్ణయించారు.
జనాభా లెక్కలకు అంతా సిద్ధం

జన గణన–2021 కార్యక్రమానికి కలెక్టర్‌ ప్రిన్సిపల్‌ సెన్సెస్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. ఆయా మున్సిపాలిటీలకు కమిషనర్లు ప్రిన్సిపల్‌ సెన్సెస్‌ అధికారులుగా ఉంటారు. ఆర్డీఓలు సబ్‌ డివిజన్‌ సెన్సెస్‌ అధికారులుగా, తహసీల్దార్లు మండల చార్జ్‌ ఆఫీసర్లుగా, ఎంపీడీఓలు అడిషనల్‌ చార్జ్‌ ఆఫీసర్లుగా ఉంటారు.  2020 ఏప్రిల్‌ నుంచి నేషనల్‌ పాపులేషన్‌ రిజిష్టర్‌ తయారు చేస్తారు. జనాభా, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, వలస తదితర వివరాలు నమోదు చేస్తారు. రెండు తరాల కుటుంబ సభ్యుల వివరాలను ప్రజలు అధికారులకు చెప్పాల్సి ఉంటుంది. స్వస్థలం ఏదీ? ఎప్పటి నుంచి ఇక్కడ నివాసముంటున్నారు? ఏమి చేస్తున్నారు? తదితర వివరాలు సెన్సెస్‌ అధికారులకు తెలపాలి. అసోం, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో నేషనల్‌ రిజిష్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ (ఎన్‌ఆర్‌సీ) తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెన్సెస్‌లో భాగంగా తయారు చేయనున్న నేషనల్‌ పాపులేషన్‌ రిజిష్టర్‌ ఇందుకు దోహదపడుతుంది. ఎన్‌పీఆర్‌ ఆధారంగానే ఎన్‌ఆర్‌సీ రూపొందిస్తారు. దీంతోపాటు హౌస్‌ లిస్టింగ్‌ ఆపరేషన్‌ కూడా నిర్వహిస్తారు.  
Previous Post Next Post