రాహుల్ కు మళ్లీ కాంగ్రెస్ పగ్గాలు ? - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాహుల్ కు మళ్లీ కాంగ్రెస్ పగ్గాలు ?

న్యూ ఢిల్లీ డిసెంబర్ 7 డిసెంబర్ 7   (way2newstv.com)
రాహుల్ మళ్లీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం ఖాయంగా తెలుస్తోంది.మహారాష్ట్ర హర్యానా రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దగా  ప్రచారం ఎక్కువ చేయకున్నా.. సీట్లు మాత్రం సాధించింది. కాంగ్రెస్ కొంచెం ఈ ఎన్నికలపై దృష్టి పెట్టింటే అధికారాన్ని అందుకునేది అని అందరూ అనుకున్నారు. అలాగే  సోనియా వయోభారం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ మళ్లీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం ఖాయంగా తెలుస్తోంది.  రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి చేపడితే.. వచ్చే  ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవచ్చు అనే మాటలు కూడా పార్టీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. 
రాహుల్ కు మళ్లీ కాంగ్రెస్ పగ్గాలు ?

దీనిపై పార్టీ కీలక నేత కేసీ వేణుగోపాల్ .. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీ మళ్లీ చేపట్టనున్నారని తెలిపారు.ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో రాహుల్ తిరిగి పగ్గాలు అందుకోక తప్పదు అని రాహుల్ గాంధీ దీనికి  అంగీకరిస్తారని అభిప్రాయపడ్డారు.కాంగ్రెస్ ..దేశ చరిత్రలో  వందేళ్లకు పైగా చరిత్ర గల ఏకైక పార్టీ. ప్రస్తుతం రాజకీయాలలో కొనసాగుతున్న కీలకనేతలందరిలో దాదాపుగా అందరూ కాంగ్రెస్ పార్టీ లో రాజకీయా ఓనమాలు నేర్చుకొని వచ్చిన వారే. అలాగే దాదాపు కొన్నే దశాబ్దాల పాటు దేశాన్ని ఏకచక్రాధిపత్యంగా ఏలిన పార్టీ. ఎలాంటివారికైనా ఎదో ఒక సమయంలో మరణం తప్పదు అన్నట్టు ..గత ఎన్నికల సమయంలో  మోడీ మాయ ముందు కాంగ్రెస్ ..కనీసం ప్రతిపక్ష హోదాకి కూడా అర్హత సాధించలేక చిత్తుచిత్తుగా ఓడిపోయింది.2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవడం... మరోవైపు దశబ్దాలుగా గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథీలో స్వయంగా తానే బరిలో ఉన్న ఓడిపోవడంతో రాహుల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వద్దు అని ఎంతమంది చెప్పినా కూడా ఓటమికి భాద్యత వహిస్తూ ...రాహుల్ ఆనాడు రాజీనామా విషయం లో వెనక్కి తగ్గలేదు. ఆ తరువాత మళ్లీ కాంగ్రెస్ లో   సోనియా శకం మొదలైంది.జనవరిలో జరిగే ఏఐసీసీ విస్తృతస్థాయి సమావేశంలో రాహుల్ ను మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మొత్తంగా చూస్తే మళ్లీ కాంగ్రెస్ లో రాహుల్ శకం మొదలు కాబోతుంది అని అర్థమౌతుంది. చూడాలి మరి ఈసారైనా మోడీ కి గట్టి పోటీ ఇచ్చి అధికారాన్ని కైవసం చేసుకుంటారేమో ...