హైదరాబాద్ డిసెంబర్ 12 (way2newstv.com)
పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కొన్ని ట్వీట్స్ చేశారు. అస్సాం సోదర, సోదరీమణులకు హామీ ఇస్తున్నానని, క్యాబ్‌తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మోదీ అన్నారు. మీ హక్కులను, విశిష్ట గుర్తింపును, మీ అద్భుత సంస్కృతిని ఎవరూ ఏమీ చేయలేరని హామీ ఇస్తున్నట్లు ప్రధాని చెప్పారు.
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అస్సాం ప్రజలకు మోడి హామీ
అస్సాం సంస్కృతీ, సాంప్రదాయాలు కలకాలం వర్థిల్లుతాయన్నారు. రాజ్యాంగంలోని క్లాజ్ 6 ప్రకారం అస్సాం ప్రజల రాజకీయ, భాష, సాంస్కృతిక, భూమి హక్కులను సంరక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ మరొక ట్వీట్‌లో ఎన్సీపీ నేత శరద్ పవార్‌కు బర్త్‌డే గ్రీటింగ్స్ తెలిపారు. శరద్ పవార్‌కు సుదీర్ఘ, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వాలంటూ ఆయన ప్రార్థించారు. ఇక మూడవ దశ ఎన్నికలు జరుగుతున్న జార్ఖండ్ ప్రజలకు కూడా మోదీ కొన్ని విజ్ఞప్తులు చేశారు. భారీ సంఖ్యలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. యువ స్నేహితులంతా వెళ్లి ఓటు వేయాలన్నారు.