ఖమ్మం డిసెంబర్ 4, (way2newstv.com)
గ్రామ పంచాయితీలకు ట్రాక్టర్స్ కొనుగొలు పథకాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంబించారు. ఖమ్మం జిల్లాలోని 56 పంచాయితీలకు 56ట్రాక్టర్లను పంపిణి చేశారు.ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రంలో 30రోజుల పథకం పల్లెల అబివృద్దికి బృహత్తర పథకమన్నారు. పల్లెల ప్రగతిలో భాగంగా 30 రోజుల ప్రణాళిక గ్రామంలో బృహత మార్పు తీసుకొని వచ్చిందిని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు
పల్లెలను అభివృధ్ధి పథంలో నడిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అందులో భాగంగానే ప్రతీ గ్రామ పంచాయితీకి ఒక్కో ట్రాక్టర్ చొప్పున ప్రభుత్వం ఇస్తోందని,ప్రతి గ్రామానికి ట్రాక్టర్ తో పాటు ట్రోలర్,ట్యాంకర్, చెత్తతొలగించడానికి బ్లేడ్ను ఒక యూనిట్ను ఇస్తున్నామని తెలిపారు.ప్రతి గ్రామ పంచాయతీకి ఓ ట్రాక్టర్ ఇవ్వటం ద్వారా గ్రామలు అభివృద్ధి చెందుతాయిని,గ్రామంలో ఇంటి ఇంటికి చెత్త సేకరణ జరపటానికి ఈ ట్రాక్టర్లు కు రిజిస్ట్రేషన్ నుండి మినహాయింపు ఇవ్వనున్నట్టు మంత్రి తెలిపారు.ఈట్రాక్టర్లను కేవలం గ్రామపంచాయితీల అవసరాలకు మాత్రమే వాడాలని పర్సనల్గా వాడుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.