ఉల్లిపాయల ధరలపై సెటైర్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఉల్లిపాయల ధరలపై సెటైర్లు

హైద్రాబాద్, డిసెంబర్ 11  (way2newstv.com)
ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో సోషల్‌ మీడియా వేదికగా సెటైర్లు హల్‌చల్‌ చేస్తున్నాయి.  సినిమాలో సన్నివేశాలు  ఆధారంగా ఉల్లిపాయను తాడుతో కట్టి దానిని చూస్తూ భోజనం చేయడం, ఉల్లిపాయల కవర్‌కు తాళం వేయడం, ఆటోలో ప్రయాణించి, సెల్‌ఫోన్‌ కొనుగోలు చేసి నగదు బదులు ఉల్లిపాయలు ఇవ్వడం, వివాహాలు, పుట్టిన రోజు ఇలా శుభకార్యాలకు బహుమతుల కింద ఉల్లి అందచేయడం వంటివి సోషల్‌ మీడియా వేదికగా హల్‌చల్‌ చేస్తున్నాయి.పెళ్లికి సన్నిహితులు, స్నేహితులు గిఫ్ట్‌లు ఇవ్వడం ఓ ఆనవాయితీ. ఊహించనిది, విలువైన వస్తువులు ఇచ్చి కొత్త జంటలను సర్‌ప్రైజ్ చేస్తుంటారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉల్లి బాగా పాపులర్ అయింది. దాన్ని కొనాలంటే సామాన్యుడు హడలిపోతున్నాడు. 
ఉల్లిపాయల ధరలపై సెటైర్లు

ఇంకేముంది కొత్త జంటలకు ఉల్లిని గిఫ్ట్‌గా ఇచ్చి తమ నిరసన తెలపడంతో పాటు వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా బెంగళూరు ఓ నవ జంటకు ఉల్లి గిఫ్ట్ ఇచ్చినట్టుగానే తమిళనాడులో జరిగిన పెళ్లిలో ఫ్రెండ్స్ ఉల్లి గిఫ్ట్‌గా ఇవ్వడం వైరల్‌గా మారింది. ఒక్కోసారి పెళ్లి వేడుకల్లో ఇచ్చే గిఫ్ట్‌లను చూస్తే ఆశ్చర్యంతో పాటుగా, నవ్వు ఆపుకోలేము. ఇటీవలే కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ జంట వివాహం చేసుకుంది. ఆ వివాహ వేడుకల్లో వారికి వచ్చిన గిఫ్ట్‌ను చూసి ఆశ్చర్యపోయారు ఆ నూతన జంట. ఇక బంధువులు, మిత్రులు అందరూ హాజరైన ఆ వేడుకల్లో వరుడి స్నేహితులు కొందరు ఓ రెండు గిఫ్ట్ ప్యాక్ లు అందజేశారు. స్నేహితులు ఏం గిఫ్ట్ ఇచ్చారో చూద్దామని అక్కడే గిఫ్ట్ ప్యాక్ ను ఓపెన్ చేసింది కొత్త జంట.. అంతే ఆ గిఫ్ట్ లో ఉన్న వస్తువులను చూసి షాక్ అయ్యింది. అవేంటో కాదు... ఉల్లిపాయలు. గత కొన్ని రోజులుగా దేశంలో ఉల్లి ధరలు మండిపోతున్నాయి. దేశంలో ఉల్లి రూ. 150 నుంచి రూ. 200 వరకు ఉంటోంది. దీంతో స్నేహితులు రెండు కేజీల ఉల్లిని కొనుగోలు చేసి రెండు పెద్ద గిఫ్ట్ ప్యాక్ లో అందంగా ప్యాక్ చేసి వధూవరులకు అందజేశారు. ఉంగరంలో ఉల్లిపాయ.. తాంబూలంలో ఉల్లిపాయలు. పేకాట రాయుళ్ల పందాల్లో ఉల్లిపాయలు. పెళ్లి రిసెప్షన్ లో పెళ్లి కూతురుకి..పెళ్లి కొడుక్కి గిఫ్ట్ గా ఉల్లి పాయలు. జువెలరీ బాక్సుల్లో ఉల్లిపాయలు. తన ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తున్న ఓ వ్యక్తి దగ్గరకు సడెన్ గా ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు వచ్చారు. మేం ఇన్ కమ్ ట్యాక్స్ అధికారలం..మీ ఇంట్లో కూరల్లో ఉల్లిపాయలు వాడుతున్నారనీ తెలిసింది అందుకే మీ ఆస్తులపై రైడ్ చేయటానికి వచ్చామని కార్టూన్ తెగ నవ్విస్తుంది. బాహుబలి ఒక్కడే మోయగలడు అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ఈనేపథ్యంలో శివలింగాన్ని బదులు ఉల్లిగడ్డ ఎత్తుకున్న ప్రభాస్ ఫొటో వైరల్ అవుతున్నది.ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని మన పెద్ద వాళ్ళు చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ ఉల్లిని తినాలంటే మనం కొంచం వెనుక ముందు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ప్రస్తుతం ఉల్లి ధర మార్కెట్ లో ఘాటెక్కుతోంది. ప్రస్తుతం ఉల్లి ధర కిలో 55 నుండి అరవై రూపాయలు పలుకుతుంది. వర్షాలు కారణంగా ఉల్లి పంట దెబ్బ తినడంతో ధర పెరిగింది. అయితే పెరిగిన ఉల్లి ధర గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్స్ పేలుస్తున్నారు. ఉల్లిని కొనుకొని వ్యాపారం చేస్తే మనం ఏకంగా అంబానీ అవొచ్చు.. ఇక పెళ్ళికిగాను ప్రియురాలుకి ప్రియుడు ఉంగరానికి బదులు ఉల్లిపాయను ఇవ్వడం.. ఒకప్పుడు ఉల్లిని కర్రీ చేసుకోవాలంటే ఆ ఉల్లి మన చేత కన్నీళ్లను పెట్టించేది కానీ ఇప్పుడు ఆ ధర మన చేత కన్నీళ్లను పెట్టిస్తుంది వంటి ఫన్నీగా పోస్ట్లు పెడుతున్నారు.డబ్బున్నవారు బంగారం, ఆభరణాలతో పెండ్లికూతురుని అలంకరిస్తారు. బంగారాన్నే ఎందుకు ఎంచుకుంటారంటే. అవి చాలా విలువైనవి కాబట్టి.. ఇప్పుడు అంతకంటే విలువైనవి ఉల్లిగడ్డలంటున్నారు. అందుకే పెండ్లికూతురు అలంకరణ విషయంలో జడపట్టీ నుంచి పూర్తి వడ్డానం, కమ్మలు, మెడలో దండలు, కాళ్ల పట్టీల వరకు పూర్తి అలంకరణకు ఉల్లిగడ్డల్నే ఉపయోగించారు.\