అనంతపురం-అమరావతి హైవేకు వంద కోట్లు

అయరావతి డిసెంబర్ 16  (way2newstv.com)
అనంతపురం-అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే పై రాష్ట్ర ఆర్అండ్ బి శాఖామంత్రి  ధర్మాన కృష్ణదాస్ శాసనమండలిలో వివరణ ఇచ్చారు.  అనంతపురం-అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే కోసం రూ.100 కోట్లు కేటాయించాం.   అవసరమైన మేరకు ఇంకా నిధులు కేటాయించేందుకు సిద్దం.  దీనిని అత్యంత ముఖ్యమైన హైవేగా ప్రభుత్వం భావిస్తోంది. - ఈ హైవే కోసం 4993 హెక్టార్ల భూమిని సేకరించాల్సి వుంది.  
అనంతపురం-అమరావతి హైవేకు వంద కోట్లు

దీనిలో ఇప్పటికే 4839 హెక్టార్ల సేకరణకు 3ఎ నోటిఫికేషన్ ఇచ్చాం.  అటవీశాఖ నుంచి కూడా అనుమతులు తీసుకుంటున్నాం.   ట్రాఫిక్ అవసరాలను బట్టి హైవే ఎన్ని లైన్లతో వుండాలనేది పరిగణలోకి తీసుకుంటున్నామని అన్నారు.
Previous Post Next Post