మళ్లీ జగన్ కు నిరాశే... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మళ్లీ జగన్ కు నిరాశే...

విజయవాడ, డిసెంబర్ 7, (way2newstv.com)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన పెద్దగా కలసి రావడం లేదు. ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులను కలవాలని వెళ్లినప్పుడు ఏదో ఒక అవాంతరాలు వచ్చిపడుతున్నాయి. గత అక్టోబరు నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా ప్రధాని నరేంద్ర మోడీని కలవలేకపోయారు. అమిత్ షా పుట్టినరోజు సందర్భంగా ఆయన కొంతసేపు మాత్రమే జగన్ భేటీ అయ్యారు. పూర్తి స్థాయిలో రాష్ట్ర సమస్యలపై అమిత్ షాతో జగన్ చర్చించలేకపోయారు.తాజాగా కూడా జగన్ ఢిల్లీ పర్యటన హడావిడిగానే సాగింది. ఆయన గురువారం రాత్రి హడావిడిగా ఢిల్లీ చేరుకున్నారు. రాత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ దాదాపు ఖరారయింది. 
మళ్లీ జగన్ కు నిరాశే...

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్వయంగా అమిత్ షాను అపాయింట్ మెంట్ కోరగా గురువారం రాత్రి పదిగంటలకు తనను కలవవచ్చని అమిత్ షా చెప్పడంతోనే జగన్ ఢిల్లీ చేరుకున్నారు. అయితే అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ టెలికాన్ఫరెన్స్ ఉండటంతో అమిత్ షాను కలవడం జగన్ కు కుదరలేదు. ఈరోజు ఆయన ప్రధాని నరేంద్రమోదీని కలవాలని భావించారు.కడప స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనకు, అమ్మవొడి ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించాలని జగన్ భావించారు. కానీ తన వ్యక్తిగత సహాయకుడు మృతి చెందడంతో ఆయన తన ఢిల్లీ షెడ్యూల్ ను రద్దు చేసుకుని ఏపీకి తిరుగు ప్రయాణమయ్యారు. ఇటీవల కాలంలో జగన్ ఢిల్లీ పర్యటన ఆయనకు అచ్చిరావడం లేదు. కావాలనే బీజేపీ పెద్దలు జగన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదా? అన్న అనుమానం లేకపోలేదు.గతంలో ఇదే అనుభవం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుకు కూడా ఎదురయింది. ఇప్పుడు జగన్ కు కూడా సేమ్ టు సేమ్ ఢిల్లీలో జగన్ కు రిపీట్ అవుతుంది. రాష్ట్ర సమస్యలను ప్రస్తావించడానికి, విభజన హామీలను నెరవర్చమని కోరేందుకే జగన్ ప్రధాని, హోంమంత్రిని కలవాలనుకున్నా కుదరకపోవడం కావాలని చేస్తున్నారన్న అనుమానాలు మాత్రం వైసీపీ నేతల్లో ఉన్నాయి. కమలం పెద్దలతో జగన్ ఎంత సర్దుకుపోదామని భావిస్తున్నా వారు  కలసి రావడంలేదు. మరోవైపు ఢిల్లీలో ఉన్న వైసీపీ నేతలు కూడా సరైన విధంగా లాబీయింగ్ చేయలేకపోతున్నారని, ముఖ్యమంత్రిని ఢిల్లీకి రప్పించి ఎవరితో భేటీ కాకుండా వెనుదిరిగి వెళ్లడం కూడా ఢిల్లీలో ఉన్న వైసీపీ నేతల వైఫల్యమేనన్న చర్చ పార్టీలో జరుగుతుంది.