ఫిబ్రవరి 15 నుంచి కొత్త పెన్షన్, బియ్యం కార్డులు పంపిణీ
ఉగాదినాటికి 25 లక్షల ఇళ్లపట్టాలు మంజూరు
ఇంట్లో మహిళల పేర్లమీద పట్టాలు
అమరావతి జనవరి 28, (way2newstv.in)
నేను గ్రామాల్లో పర్యటించేటప్పుడు.. మీ ఊరిలో ఇంటి స్థలం లేనివాళ్లు ఎవరైనా ఉన్నారా? అని అడిగితే.... చేయెత్తే పరిస్థితి రాకూడదు. ఇచ్చే ఇళ్ల పట్టాలు నివాస యోగ్య స్థలాల్లో ఉండాలి. మెజార్టీ లబ్ధిదారుల అంగీకారం తీసుకోండి. అభ్యంతరకర ప్రాంతాల్లో నివాసం ఉన్నవారిపట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించండని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం అయన స్పందన కార్యక్రమంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ ఇళ్లు కట్టించి ఇచ్చిన తర్వాతే వారిని తరలించండి. ఫిబ్రవరి 28న జగనన్న విద్యా వసతి దీవెన ప్రారంభం.
ఫిబ్రవరి 1 నుంచి కొత్త పెన్షన్లు – ఇంటివద్దకే పెన్షన్లు
ఇప్పుడు మొదటి విడత, జులై– ఆగస్టులో రెండో విడత వుంటుంది. 11 లక్షలమందికిపైగా విద్యార్థులకు లబ్ధి పోందుతారు. ఫిబ్రవరి 28న 3,300 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం అవుతాయి. ఏప్రిల్ నెలాఖరు నాటికి 11వేలకుపైగా రైతు భరోసా కేంద్రాలు వస్తాయని అన్నారు.మధ్యాహ్న భోజనం నాణ్యత ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకూడదని సీఎం ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్లు స్కూళ్లకు వెళ్లి పరిశీలన చేయాలి. మరిన్ని జిల్లాల్లో ఇసుక డోర్ డెలివరీ చేస్తాం. జనవరి 30న అనంతపూర్, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇసుక డోర్ డెలివరీ, ఫిబ్రవరి 7 నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో డోర్ డెలివరీ, ఫిబ్రవరి 14 నుంచి గుంటూరు, చిత్తూరు, కర్నూల్లో ఇసుక డోర్ డెలివరీ, వర్షాకాలం వచ్చే సరికి 60–70 లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉంచాలని సీఎం అన్నారు.దిశ పోలీస్స్టేషన్ల ఏర్పాటుపై సీఎం ఆరా తీసారు. ఫిబ్రవరి మొదటి వారానికి రాజమండ్రి, విజయనగరం దిశ పోలీస్ స్టేషన్లు సిద్ధమవుతున్నాయని అధికారులుసీఎం కు వివరించారు. సీఎం మాట్లాడుతూ 13 జిల్లాల్లో 13 కోర్టుల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కలెక్టర్లు కృషిచేయాలని అన్నారు. • స్పందన కింద వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు 60శాతం వరకూ బియ్యం కార్డులు, పెన్షన్లు, ఇళ్లకు సంబంధించినవే ఉన్నాయి. స్పందనకు సంబంధించి అధికారులు బాగా పనిచేశారు. చాలామంది ప్రశంసించారు కూడా అని సీఎం వ్యాఖ్యానించారు. ఇక పై దరఖాస్తులకు సంబంధించి మనం కార్డులు జారీచేయాల్సి ఉంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మొత్తంగా 54.64 లక్షలకు పైగా పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాం. ఎన్నికలకు 6 నెలల ముందు పెన్షన్లు 39 లక్షలు ఉండేవి. ఇప్పుడు 54లక్షలకు పైబడి ఇస్తున్నాం. పెన్షన్లు ఫిబ్రవరి 1 నుంచి డోర్డెలివరీ చేస్తున్నామని సీఎం అన్నారు.