న్యూఢిల్లీ, జనవరి 9 (way2newstv.com)
కేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త పథకాలను ఆవిష్కరిస్తూ వస్తోంది. మోదీ సర్కార్ వివిధ రంగాల్లో పలు సంస్కరణలకు శ్రీకారం చుడుతూ ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తూ వెళ్తోంది. కేంద్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా శుభవార్త అందించింది. కొత్త ఏడాదిలో తీపికబురు తీసుకువచ్చింది.కేంద్ర ప్రభుత్వం ‘ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు’ స్కీమ్‌ను అమలు చేసింది. జనవరి 1 నుంచే ఈ పథకం అమలులోకి వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నివసించే ప్రజలు ఎక్కడకైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చు. 12 రాష్ట్రాల్లో ఈ పథకం అమలు చేసినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరా శాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ తెలిపారు.మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన ఈ ఒకే దేశం ఒకే రేషన్ కార్డు స్కీమ్ ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోనూ అమలులో లేదు.
12 రాష్ట్రాల్లో ‘ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు’
తొలిగా దేశంలో కేవలం 12 రాష్ట్రాల్లో మాత్రమే అమలులోకి వచ్చింది. ఈ 12 రాష్ట్రాల్లో మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఉండటం గమనార్హం.12 రాష్ట్రాల్లో ఒకే దేశం ఒకే రేషన్ కార్డు పథకం అమలులోకి రావడంతో ఈ ప్రాంతాల్లోని ప్రజలు ఏ రాష్ట్రంలోనైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చు. అంటే ఏపీలోని ప్రజలు తెలంగాణలో, తెలంగాణలోని ప్రజలు ఏపీలో రేషన్ సరుకులు పొందొచ్చు. అంతేకాకుండా ఏపీ, తెలంగాణ ప్రజలు ఇతర పది రాష్ట్రాల్లోనూ రేషన్ తీసుకోవచ్చు. ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఉండదు.కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం తొలి దశలో ఒకే దేశం ఒకే రేషన్ కార్డు స్కీమ్‌ను 12 రాష్ట్రాల్లో మాత్రమే అమలు చేసింది. రానున్న రోజుల్లో అంటే జూన్ చివరి నాటికి ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పథకం అందుబాటులోకి రానుంది. అప్పుడు ఆయా రాష్ట్రాల్లోని ప్రజలు ఏక్కడైనా రేషన్ సరుకులు పొందొచ్చు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహరాష్ట్ర, హరియాణ, రాజస్తాన్, కర్నాటక, కేరళ, గోవా, మధ్యప్రదేశ్, త్రిపుర, జార్కండ్ వంటి రాష్ట్రాల్లో ఒకే దేశం ఒకే రేషన్ స్కీమ్ అమలులోకి వచ్చింది. ఈ 12 రాష్ట్రాల్లోని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్) లబ్ధిదారులు వారి రేషన్ సరుకులను ఎక్కడైనా పొందే అవకాశం ఉంటుంది.కొత్త స్కీమ్‌లో భాగంగా కొత్త రేషన్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. ఏపీలో ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. ఒకే దేశం ఒకే రేషన్ స్కీమ్ అమలులో ఉన్న రాష్ట్రాలు ఒకే రేషన్ కార్డు ఫార్మాట్‌ను అనుసరించాలని కేంద్రం పేర్కొంటోంది. ఈ మేరకు కేంద్రం ఆయా రాష్ట్రాలకు రేషన్ కార్డు స్టాండర్డ్ ఫార్మాట్‌కు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది.స్కీమ్ అమలులో ఉన్న రాష్ట్రాల్లోని లబ్ధిదారులు కచ్చితంగా ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఇపీఓఎస్) పరికరాల్లో ఆధార్ లేదా బయోమెట్రిక్స్ ధ్రువీకరణ ఆనంతరం ఈ సేవలు పొందగలరు. ఫుల్లీ ఇపీఓఎస్ పరికాలు కలిగిన రేషన్ దుకాణాల ద్వారానే వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ఇంటర్ స్టేట్ పోర్టబిలిటీ సాధ్యమౌతుంది.కేంద్ర ప్రభుత్వం ఈ పథకం వల్ల దాదాపు 3.5 కోట్ల మంది ప్రయోజనం పొందొచ్చని అంచనా వేస్తోంది. మరీముఖ్యంగా వలస వెళ్లే కార్మికులు, రోజువారీ కూలీలకు ఎక్కువ లాభం చేకూరనుంది. వీరు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఎఫ్‌పీఎస్ షాప్‌ల నుంచి ఆధార్ అథంటికేషన్ ద్వారా సబ్సిడీ ధరకే రేషన్ తీసుకోవచ్చు. రేషన్ షాపులు ఎక్కడున్నా పర్లేదు. బయోమెట్రిక్స్ ద్వారా సరుకులు పొందొచ్చు. SBI ఏటీఎం క్యాష్ విత్‌డ్రా లిమిట్, చార్జీలు.. రోజుకు ఎంత డబ్బు తీసుకోవచ్చంటే..కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ డిసెంబర్ 3న వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమ్‌ను ప్రకటించారు. ఈ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ 2020 జూన్ నుంచి అమలు చేస్తామని పేర్కొన్నారు. దీంతో ఫేక్ రేషన్ కార్డు ఉన్న వారికి షాక్ తగ్గుతుంది. అలాగే పేదలకు, కూలీలకు ప్రయోజనం కలుగుతుంది.