జిల్లా ఎస్పీ సింధూ శర్మ
జగిత్యాల జనవరి 21 (way2newstv.com)
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్ పెల్లి ,ధర్మపురి, రాయికల్ ఐదు మున్సిపల్ పట్టణాలలో పోలింగ్ ముగిసే వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ సింధూ శర్మ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ప్రశాంతంగా జిల్లాలో ఎన్నికలునిర్వహించేందుకు భద్రత చర్యలు తీసుకున్నామన్నారు.
మున్సిపల్ ఎన్నికలకు 144 సెక్షన్ అమలు
పాత నేరస్తులు, అనుమానితులను ఇప్పటికే 149 మందినిబైండోవర్ చేశామని, పోలింగ్ కేంద్రాల సమీపంలో వంద మీటర్ల వరకు ఆంక్షలు ఉంటాయని, పోలింగ్ రోజున ఓటర్లనురవాణా చేయడం, భోజన వసతులు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఓటింగ్ సమయంలోఫొటోలు, సెల్ఫీలు దిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ దక్షిణమూర్తి,సీఐలు
ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.