16 జిల్లాల ఏపీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

16 జిల్లాల ఏపీ

విజయవాడ, జనవరి 29, (way2newstv.com)
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు జరిగినా.. అవేమీ కార్యరూపం దాల్చలేదు. జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్త జిల్లాల ప్రచారం భారీగా సాగింది. అందుకు సంబంధించిన వివరాలు కొన్ని అదేపనిగా బయటకు వచ్చేవి. ప్రభుత్వం ఏర్పడి ఏడెనిమిది నెలలు పూర్తి అయిన తర్వాత కూడా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రయత్నాలు కొంత జరిగినా ఇప్పటివరకూ పూర్తి కాలేదు.తాను అనుకున్నంతనే ఎడాపెడా నిర్ణయాలు తీసుకునే సీఎం జగన్.. కొత్త జిల్లాలకు సంబంధించి సానుకూలంగా నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవటం లేదన్న ప్రశ్న వినిపిస్తోంది. 
16 జిల్లాల ఏపీ

అయితే.. నిధుల లేమితోనే కొత్త జిల్లాల విషయంలో జాప్యం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీలో కొత్తగా మూడు జిల్లాల్ని ఏర్పాటు చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. యుద్ధ ప్రాతిపదికన ఈ జిల్లాల్ని ఏర్పాటు చేస్తారంటున్నారు.ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి కావటమే కాదు.. మూడు జిల్లాల ప్రకటన త్వరలోనే వచ్చే వీలుందని చెబుతున్నారు. ఇంత హడావుడిగా కొత్త జిల్లాల్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఆ జిల్లాలేమిటి? అన్న విషయాల్లోకి వెళితే.. ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా తెర మీదకు వచ్చిన మూడు కొత్త జిల్లాలుగా గుంటూరు జిల్లాలో భాగమైన గురజాలతో కూడిన జిల్లా ఒకటని.. మరొకటి మచిలీపట్నం.. ఇంకొకటి విశాఖ జిల్లా పరిధిలోని అరకును కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు.ఎందుకిలా ఉంటే.. వెనుకబడి జిల్లాల్లో కేంద్రం ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీల అనుమతితో పాటు.. భారీ ఎత్తున వచ్చే నిధుల్ని సొంతం చేసుకోవటం కోసం ఈ కొత్త జిల్లాల ప్రతిపాదనను తెర మీదకు తెచ్చారంటున్నారు. మామూలుగా అయితే.. ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే రూ.600 కోట్ల వరకూ ఖర్చు అవుతుంది. అదే.. వెనుకబడిన జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే.. దానికయ్యే ఖర్చులో 60 వాతం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. అంటే.. మూడు మెడికల్ కాలేజీలకు రూ.1800 కోట్లు అవసరమైతే.. అందులో రూ.1080 కోట్ల మొత్తాన్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చే వీలుంది.కేవలం ఏడు వందల కోట్లు ఖర్చుతో మూడు మెడికల్ కాలేజీల్ని రాష్ట్రానికి తీసుకు రావొచ్చు. అందుకే.. ఈ అవకాశం మిస్ చేసుకోకూడదన్న ఉద్దేశంతో ఆఘమేఘాల మీద మూడు కొత్త జిల్లాల్ని.. అది కూడా వెనుకబడిన జిల్లాల్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు తెర మీదకు వచ్చిన మూడు జిల్లాలకు సంబంధించి తమను కొత్త జిల్లాలుగా ప్రకటించాలని ఆయా ప్రాంతాల వారు కోరుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రజలు కోరుకుంటున్నది.. ప్రభుత్వం అనుకుంటున్నది ఒకటేలా ఉండటంతో పాటు.. రాష్ట్రానికి మూడు మెడికల్ కాలేజీలు రావటం వల్ల అంతో ఇంతో మేలు జరుగుతుందన్న భావనతో.. కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కారణంతోనే తొలుత అనుకుంటున్నట్లుగా పాతిక జిల్లాల ఏర్పాటును కాస్త పక్కన పెట్టి.. తొలుత మూడు కొత్త జిల్లాలు.. తర్వాత అవసరానికి అనుగుణంగా జిల్లాల పెంపుదల ఉండే అవకాశం ఉందంటున్నారు.