2020లో అల్లు అర్జున్ ట్రిపుల్‌ ట్రీట్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

2020లో అల్లు అర్జున్ ట్రిపుల్‌ ట్రీట్

హైద్రాబాద్, జనవరి 2  (way2newstv.com)
 అల్లు అర్జున్‌ నటించిన ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. 2018లో రిలీజ్‌ అయిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాడిజాస్టర్‌ కావటంతో బన్నీ కాస్త గ్యాప్‌ తీసుకున్నాడు. దీంతో 2019లో అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అందుకే ఆ లోటును తీరుస్తూ 2020లో ట్రిపుల్‌ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు బన్నీ.కొత్త సంవత్సరం మొదట్లోనే అల వైకుంఠపురములో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు బన్నీ. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఆడియో సూపర్‌ హిట్ కావటంతో సినిమా మీద కూడా మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది. 
2020లో అల్లు అర్జున్ ట్రిపుల్‌ ట్రీట్

అపుట్‌పుట్‌ ఆ అంచనాలను అందుకునే స్థాయిలో ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్‌.జనవరిలోనే మరో సినిమాను ప్రారంభిస్తున్నాడు బన్నీ. తనతో ఆర్య, ఆర్య 2 లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌ను తెరకెక్కించిన సుకుమార్ దర్శకత్వంలో నెక్ట్స్ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరాయి. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్‌ జానర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నాడు.ఈ సినిమా తరువాత యువ దర్శకుడు వేణు శ్రీరామ్‌ డైరెక్షన్‌లో ఐకాన్‌ అనే సినిమా చేయనున్నాడు అల్లు అర్జున్‌. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ కూడా రిలీజ్‌ అయ్యింది. మోటర్‌ సైకిల్‌ డైరీస్‌ తరహాలో ట్రావెల్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అయితే వేణు శ్రీరామ్‌ ప్రస్తుతం పింక్‌ తెలుగు రీమేక్‌ పనుల్లో బిజీగా ఉండటంతో ఐకాన్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు.వీళ్లతో పాటు మరికొంత మంది దర్శకులు బన్నీతో సినిమా చేసేందుకు క్యూలో ఉన్నారు. తమిళ దర్శకుడు లింగుస్వామి అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాడు. అదే సమయంలో పరుశురామ్‌తోనూ బన్నీ ఓ సినిమా చేసేందుకు చాలా రోజుల క్రితమే ఓకె చెప్పాడు. కానీ ఈ సినిమాలకు సంబంధించిన కథలు ఫైనల్‌ కాకపోవటంతో ఈ సినిమాను ఎప్పుడు పట్టాలెక్కుతాయో ఇప్పుడే చెప్పలేం.