హైదరాబాద్ జనవరి 28 (way2newstv.com)
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. దేశ చరిత్రలోనే ఇంతటి క్లీన్ స్వీప్ అందించిన ప్రజల కోసం మున్సిపల్ శాఖ మంత్రిగా పాటుపడుతానని వరాలు ప్రకటించారు. తెలంగాణ పురపాలనను ప్రక్షాళన చేస్తామని గెలిచిన మున్సిపల్ అభ్యర్థులకు కొత్త మున్సిపల్ చట్టంపై అవగాహన తరగతులు నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు.
ప్రతీ సంవత్సరం మున్సిపాలిటీలకు రూ.2704 కోట్లు ఖర్చు: కేటీఆర్
అంతేకాదు.. కేంద్రం నిధులతో కలిసి ప్రతీ సంవత్సరం మున్సిపాలిటీలకు రూ.2704 కోట్లు ఖర్చు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.మున్సిపల్ పాలన కొత్త పుంతలు తొక్కించబోతున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. ప్రతీ వార్డు లో యువజన మహిళ సీనియర్ సిటీజన్ రెసిడెంట్ కమిటీలను నియమిస్తామని.. వారి ద్వారా వార్డులను అభివృద్ధి చేస్తామని తెలిపారు.చట్టాన్ని సక్రమంగా అమలు చేసి అక్రమ కట్టడాలను కూల్చేస్తామని ఉద్యోగులపై కూడా చర్యలు ఉంటాయని కేటీఆర్ హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు పెద్ద పీట వేశామని..58మంది బీసీలకు చైర్మన్ వైస్ చైర్మన్ మేయర్ పదవులు దక్కాయని వివరించారు.