కాస్ట్లీయస్ట్ ప్లాట్ @ 650 కోట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాస్ట్లీయస్ట్ ప్లాట్ @ 650 కోట్లు

హైద్రాబాద్, జనవరి 29, (way2newstv.com)
ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థ సాలర్ పురియా సత్వా హైదరాబాద్ ఐటీ హబ్ లో రూ.650 కోట్లకు ఓ ప్లాట్ కొనుగోలు చేసింది. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్ లో 24 మిలియన్ల చదరపు అడుగుల కమర్షియల్ పొర్ట్ పోలియోను విస్తరించేందుకు సాలర్ కంపెనీ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం బెంగళూరులో 15 మిలియన్ల చదరపు అడుగుల ప్లాట్ ఉండగా, హైదరాబాద్ ఐటీ హబ్‌లో మరో 9 మిలియన్ల చదరపు అడుగుల కొత్త ప్లాట్ కొనుగోలు చేసింది.భాగ్యనగరంలోని కోకాపేటలో ఉన్న ఐటీ హబ్‌లో మరో రియల్ ఎస్టేట్ కంపెనీ Omaxeతో ఒప్పందంలో భాగంగా 25 ఎకరాల ల్యాండ్ పార్సిల్ ను సాలర్ పురియా సత్వా కొనుగోలు చేసింది. ఐటీ అభివృద్ధి కోసం రూ.650 కోట్లకు ఈ ప్లాట్ కొనుగోలుపై డీల్ కుదుర్చుకున్నాయి. దీని ద్వారా ఐటీ డెవలప్ మెంట్ కోసం హైదరాబాద్ లోని తమ కమర్షియల్ పొర్ట్ ఫోలియాను మరింత బలోపేతం చేసే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది. 
కాస్ట్లీయస్ట్ ప్లాట్ @ 650 కోట్లు

‘ఇరు కంపెనీల మధ్య డీల్ ముగిసింది. ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడా జరిగాయి. ఇక డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడమే మిగిలి ఉంది. ఒప్పందం ప్రకారం.. ప్లాట్ కొనుగోలుపై రూ.650 కోట్లను చెల్లించాల్సి ఉంది’ అని పేరు చెప్పేందుకు అంగీకరించని వ్యక్తి ఒకరు వెల్లడించారు.కోకాపేట.. ప్రధాన ఐటీ హబ్స్ లో ఒకటిగా ముందుకొస్తోంది. భవిష్యత్తులో కోకాపేట నుంచి మరిన్ని ఐటీ ప్రాజెక్టులు ప్రారంభయ్యే అవకాశాలు  కనిపిస్తున్నాయి. ఈ ఒప్పందంపై సాలర్ పురియా సత్వా కంపెనీ స్పందించేందుకు నిరాకరించింది. రియల్ ఎస్టేటర్ల మధ్య జరిగే అతిపెద్ద లావాదేవీల్లో ఇదొకటిగా చెప్పవచ్చు. సాలర్ పురియా సత్వా, అమెరికన్ ప్రైవేట ఈక్విటీ సంస్థ బ్లాక్ స్టోన్ గ్రూపు కలిసి సంయుక్తంగా 3.3 మిలియన్ల చదరుపు అడుగుల విస్తీర్ణంతో ఆఫీసు పార్క్ కొనుగోలు చేశాయి. కాఫీ డే ఎంటర్ ప్రైజెస్ సంస్థ సొంతమైన ఈ పార్క్‌ను రూ.2,700 కోట్ల విలువైన ఒప్పందంలో భాగంగా రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనుగోలు చేశాయి. వాణిజ్య కార్యకలాపాల కోసం హైదరాబాద్ ఐటీ హబ్ లో 13 మిలియన్ల చదరపు అడుగుల భవనాన్ని రియల్ ఎస్టేట్ డెవలపర్ నిర్మిస్తోంది. ఇటీవల కాలంలో ఇదే హబ్ లో ఐటీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గాన్, ఇంటెల్, ఒరాకిల్ సంస్థలు పెద్ద మొత్తంలో స్థలాలను లీజ్ కు తీసుకున్నాయి. సాలర్ పురియా సత్వా కంపెనీ వచ్చే రెండేళ్లలో 24 మిలియన్ల చదరపు అడుగుల కమర్షియల్ పోర్ట్ పోలియాను విస్తరించనున్నట్టు తెలిపిందివచ్చే రెండేళ్లలో రెంటల్ ఆదాయం రూ.1,800 కోట్లు, 2020 నాటికి కమర్షియల్ పొర్ట్ పోలియో నుంచి 65శాతం మేర ఆదాయం వస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది. 2019లో రియల్ ఎస్టేటర్ కంపెనీ వాణిజ్యపరంగా అభివృద్ధి చేసిన నగరాల్లో పుణె, బెంగళూరు, ఢిల్లీ NCR తర్వాత హైదరాబాద్ కూడా చేరింది.