మరో రెండు రోజుల ఉల్లి లొల్లి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మరో రెండు రోజుల ఉల్లి లొల్లి

విజయవాడ, జనవరి 1, (way2newstv.com)
వినియోగదారులకు మార్కెటింగ్ శాఖ అధికారులు సరఫరా చేయాల్సిన ఉల్లిపాయలకు వారం పాటు విరామం వచ్చింది. మహారాష్టల్రోని షోలాపూర్ ఉల్లిపాయల దిగుబడికి ఆర్థికపరమైన ఇబ్బందులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటోంది. టర్కీ, ఈజిప్టు నుండి ఉల్లిపాయలు కొనాల్సి వచ్చింది. సముద్ర యానం ద్వారా రావాల్సిన సరుకు సకాలంలో చేరటం లేదు. గత వారం చెన్నై పోర్టు నుండి వచ్చిన ఈజిప్టు ఉల్లిపాయలను రైతుబజార్ల ద్వారా వినియోగదారులకు సబ్సిడీ ధరపై కిలో రూ. 25లకే అందించారు. ఈసారి మాత్రం ఉల్లిపాయలు ముంబై పోర్టుకు వచ్చాయి. టర్కీ, ఈజిప్టు నుండి దిగుమతి చేసుకుంటున్నారు. 
మరో రెండు రోజుల ఉల్లి లొల్లి

ఈ నెల 23 నుండి నగరంలో ఉల్లిపాయల కొరత ఏర్పడింది. 24న అరకొరగా రైతుబజార్లలో ఈజిప్టు ఉల్లిపాయలు అమ్మారు. సరిగ్గా వారం నుండి వినియోగదారులు ఉల్లిపాయల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతిరోజూ తెల్లవారుజామునే రైతుబజార్లకు పరుగులు తీయడం, సబ్సిడీ ఉల్లిపాయలు స్టాక్ లేదంటూ అధికారులు రాసిన నోటీసు బోర్డు చూడటం, వెనుతిరగడం నిత్యకృత్యంగా మారింది. అయితే అసలు రైతుబజార్లలో ప్రభుత్వం ఉల్లిని అందుబాటులో ఉంచుతోందా? లేదా? అని మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దివాకరరావుని ప్రశ్నించగా ముంబై నుండి 28 టన్నుల ఉల్లిపాయల లోడు బయలుదేరిందని, ఈసారి టర్కీ, ఈజిప్టు దేశాల నుండి దిగుమతి చేసుకున్నామన్నారు. అవి రోడ్డు మార్గాన రావాలంటే మరో రెండు రోజులు పడుతుందన్నారు. దీంతో నూతన సంవత్సరం నాడు కూడా వినియోగదారులు ఉల్లిపాయల కోసం రైతుబజార్ల క్యూలైన్లలో బారులుతీరక తప్పేలాలేదు. వారం నుండి ఎదురుచూపు ఫలిస్తుందని ఆనందించాలో, నూతన సంవత్సరం ఆరంభం నాడు కూడా క్యూలైన్‌లో నిలబడాల్సి వస్తోందని బాధపడుతున్నారు.