ఇరాన్ దాడుల నేపథ్యంలో అమెరికా శాంతి మంత్రం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇరాన్ దాడుల నేపథ్యంలో అమెరికా శాంతి మంత్రం

న్యూ ఢిల్లీ జనవరి 9  (way2newstv.com)
ఇరాన్ దాడుల నేపథ్యంలో ప్రపంచానికే పెద్దన్న అత్యంత శక్తివంతమై అమెరికా సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇరాన్ ఓ వైపు క్షిపణులు ప్రయోగిస్తున్నా శాంతిమంత్రం జపించడం విశేషం. ఇరాన్ సైన్యాధ్యక్షుడిని అమెరికా చంపిన తర్వాత రగిలిపోతున్న ఇరాన్.. ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు రాకెట్ల వర్షం కురిపిస్తోంది. గురువారం కూడా ఈ దాడులు కొనసాగిస్తోంది. 
ఇరాన్ దాడుల నేపథ్యంలో అమెరికా శాంతి మంత్రం

ఇరాన్ క్షిపణి దాడి లో అమెరికా సైనికులు ఎవరూ చనిపోలేదని ప్రకటించి అధ్యక్షుడు ట్రంప్ తమ మిలటరీ స్థావరాలకు మాత్రం కొంత నష్టం వాటిల్లిందని తెలిపారు. తాము ఇరాన్ తో యుద్ధాన్ని కోరుకోవడం లేదని.. శాంతియుత సంబంధాలనే కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. ఐసిస్ ఉగ్ర వాదులను ఏరివేయడంలో ఇరాన్ కలిసి రావాలని ట్రంప్ కోరడం విశేషం. దీంతో ఇరాన్ తో ఉద్రిక్తతలకు అమెరికా స్వస్తి పలికినట్టైంది. దీంతో యుద్ధ మేఘాలు మూడో ప్రపంచ యుద్ధంపై జరుగుతున్న ఊహాగానాలకు ట్రంప్ తెరదించినట్టు అయ్యింది. ఇరాన్ దాడులకు ప్రతీకార దాడులు చేయరాదని నిర్ణయం తీసుకుంది.