అప్పుడే షురూ అయిన సంక్రాంతి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అప్పుడే షురూ అయిన సంక్రాంతి

హైద్రాబాద్, జనవరి 6, (way2newstv.com)
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లడమెలాగో అర్థం గాక జనం ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగం, ఉపాధి కోసం సిటీకి వచ్చిన వారు ఏటా 30 లక్షల మందికిపైగా ఈ పండక్కి ఊరికి వెళ్తుంటారు. మరో పది రోజులే టైం ఉండగా.. ఆన్ లైన్‌లో టికెట్ల కోసం ట్రై చేస్తే నో సీట్స్ అని వస్తోంది. ఏపీ రూట్‌కు సంబంధించి నెల రోజుల ముందుగానే ఆర్టీసీ రిజర్వేషన్లు ఫుల్ అయ్యాయి. గౌతమి, గోదావరి, రాయలసీమ, నర్సాపూర్ రైళ్లలోనూ వెయిటింగ్ లిస్ట్ 300 పైనే ఉంది. ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్వారు అడ్డగోలుగా చార్జీలు పెంచేస్తున్నారు. దాంతో సామాన్య ప్రయాణికులు స్పెషల్ సర్వీసులపైనే ఆశలు పెట్టుకున్నారు.సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లేందుకు నగరవాసులు రెడీ అవుతున్నారు. రైల్, బస్ టికెట్లు బుక్ చేసుకునేందుకు పోటీబడుతున్నారు. 
అప్పుడే షురూ అయిన సంక్రాంతి

అయితే ఇప్పటికే రైళ్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్‌లో సీట్లన్నీ బుక్ అయిపోయాయి. ముఖ్యంగా ఆంధ్రాకు వెళ్లే అన్ని రైళ్లలో వెయింటింగ్ లిస్ట్ చాంతాడంతా ఉంది. గౌతమి, గోదావరి, రాయలసీమ, నర్సాపూర్ ఇలా అన్ని రైళ్లలో 300 మంది వెయింటింగ్ లిస్ట్‌లో ఉన్నారు. లక్షలాది మంది రైల్వేశాఖ వేసే స్పెషల్ ట్రైన్స్కోసం ఎదురుచూస్తున్నారు. రెగ్యులర్ రైళ్లలో ఫిబ్రవరి వరకు టిక్కెట్లు బుక్ అయిపోయాయి. ప్రత్యే క రైళ్లను ముందుగా ప్రకటించకపోవటంతో ఊరెళ్లే వారు ఏటా కన్ ప్యూ జ్ అవుతూనే ఉన్నారు. దీంతో చాలా మంది వీలైనంత వరకు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా రెగ్యులర్ ట్రైన్స్ నవంబర్ నుంచి డిసెంబర్ నాటికే ఫుల్ అయిపోతున్నాయి. రైల్వే అధికారులు సంక్రాంతి సెలవులకు అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయకుండా పండుగకు రెండు, మూడు రోజుల ముందు పదుల సంఖ్యలో రైళ్లను ప్రకటిస్తున్నారు. అప్పటికే చాలా మంది ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. దీంతో స్పెషల్ ట్రైన్స్ ఉద్దేశం నెరవేరటం లేదు.ఆర్టీసీ అధికారులు సైతం పండుగకు నాలుగు రోజుల ముందు మాత్రమే స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. అందులోనూ రిజర్వేషన్ సౌకర్యం కొన్ని బస్సులకే ఉంటోంది. పైగా ప్రత్యే క బస్ సర్వీసులను15 రోజుల ముందు మాత్రమే ప్రకటిస్తున్నారు. సంక్రాంతికి వెళ్లే వారంతా 2 నెలల ముందే బుక్ చేసుకుంటారు. రద్దీకి అనుగుణంగా స్పెషల్ బస్సులు ప్రకటిస్తే బాగుంటుందని ప్రయాణికులు అంటున్నారు. ఇలా చేస్తే రిజర్వేషన్ల బుకింగ్‌ను బట్టి సర్వీసులు పెంచేందుకు ఛాన్స్ ఉంటుందని ప్రయాణికులు చెబుతున్నారు.