ఇంటర్ పరీక్షల్లో గ్రేడింగ్ రద్దు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇంటర్ పరీక్షల్లో గ్రేడింగ్ రద్దు

విజయవాడ, జనవరి 29, (way2newstv.com)
ఇంటర్మీడియల్ లో గ్రేడింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, పాత విధానంలోనే మార్కులు ఇచ్చే పద్ధతిని ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. ఉన్నత విద్యా సంస్థలో ప్రవేశాలకు గ్రేడింగ్ విధానం ఇబ్బందులు కలిగేలా చేస్తున్నాయని, దీంతో ఈ ఏడాది నుంచి మార్కుల పద్ధతిలోనే సాగాలని నిర్ణయించినట్లు తెలిపారు.ఇంటర్ విద్యా మండలి కార్యాలయంలో పరీక్షల నియంత్రణ అధికారి రమేశ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 
ఇంటర్ పరీక్షల్లో గ్రేడింగ్ రద్దు

సబ్జెక్టుల వారీగా మార్కులు ఇస్తామని, మొత్తం మార్కులకు కలిపి గ్రేడ్ ఇవ్వాలా? లేదా ప్రథమ, ద్వితీయ, తృతీయ క్లాస్ లుగా కేటాయించాలా.. అనే దానిపై కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు.రాష్ట్ర వ్యాప్తంగా 905 కేంద్రాల్లో ఫిబ్రవరి 1నుంచి 20వరకూ ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నామని, అన్ని కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రయోగ పరీక్షల హాల్ టిక్కెట్లను www.bie.ap.gov.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.ఫిర్యాదులు, సలహాల కోసం ప్రత్యేకంగా సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ సహాయ కేంద్రం పనిచేస్తుందని తెలిపారు. విద్యార్థుల వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని, ఏమైనా తప్పులుంటే ప్రాంతీయ తనిఖీ అధికారి కార్యాలయంలో సంబంధిత సర్టిఫికేట్లు సమర్పించి, జనవరి 31లోపు మార్పులు చేసుకోవాలని సూచించారు.