ఆర్టీసీ నుంచి అమ్మఒడి దాకా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆర్టీసీ నుంచి అమ్మఒడి దాకా

విజయవాడ, జనవరి 2  (way2newstv.com)
జ్ఞాప‌కాల‌ను ఆ పాత మ‌ధురం చేస్తూ.. 2019 నిష్క్రమించింది. అదే స‌మ‌యంలో మీకోసం నేనొచ్చా.. అంటూ .. 2020 స‌రికొత్త ఆశ‌లు.. కొంగొత్త ఆశ‌యాల‌తో దూసుకు వ‌చ్చేసింది. మ‌రి పాత సంవ‌త్సరం మిగిల్చిన సంతోషాల‌ను ఆస్వాదిస్తూనే కొత్త సంవత్సరం ల‌క్షించిన ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు ప్రజ‌లు, ప్రభుత్వం కూడా సిద్ధమ‌య్యాయి. కొత్త సంవ‌త్సరం తొలి మాసం జ‌న‌వ‌రి లోనే రాష్ట్ర ప్రభుత్వం త‌న స‌త్తా నిరూపించుకునేందుకు , ప్రజ‌ల‌కు మ‌రింత చేరువ అయ్యేందుకు, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చేందుకు కొత్తగా ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయింది.మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల వారిగా జ‌న‌వ‌రిలో ప్రజ‌ల‌కు అందించాల్సిన ప‌థ‌కాల‌పై సీఎం జ‌గ‌న్ ఇప్పటికే సంబంధిత అధికారుల‌ను అలెర్ట్ చేశారు. ప్రాధాన్యత‌ల వారీగా జ‌న‌వ‌రి తొలి రోజు నుంచి కూడా ప్రజ‌ల‌కు ప్రభుత్వానికి మ‌ధ్య స‌హృధ్బావ వాతావ‌ర‌ణం నెల‌కొనేలా, తాను ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చేలా ముందుకు సాగాల‌ని ఆయ‌న సూచించారు. దీనిలో భాగంగా జ‌న‌వ‌రి తొలి రోజు.. ఆర్టీసీ ప్రభు త్వంలో విలీనం అవుతుంది. 
ఆర్టీసీ నుంచి అమ్మఒడి దాకా

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ.. ముఖ్య నిర్ణయం తీసుకోవ‌డం జ‌గ‌న్ హిస్టరీని నెల‌కొల్పార‌నే అంటున్నారు.నిజానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా బాగుంది. అయినా కూడా అక్కడి సీఎం కేసీఆర్‌.. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసేందుకు సాహ‌సం చేయ‌లేక పోయారు. కానీ, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. ఏపీలోమాత్రం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు కూడా అప‌రిమిత ఆనందంలో మునిగిపోయారు. తాము కొన్ని ద‌శాబ్దాలుగా చూస్తున్న అంశం నేటికి నిజ‌మ‌వుతోంద‌ని వారు సంవ‌త్సరం తొలిరోజు త‌మ‌కు మిఠాయి పంచింద‌ని అంటున్నారు. ఇది నిజంగా వైసీపీ ప్రభుత్వానికి మైలు రాయిగా మార‌నుందిఇక‌, మ‌రో కీల‌క ప‌థ‌కం కూడా జ‌న‌వ‌రిలో ప్రారంభం కానుంది. అర్హులైన త‌ల్లులు అంద‌రికీ అమ్మ ఒడి ప‌థ‌కం కింద ఏడాదికి రూ.15 వేల‌ను అందించే ఈ ప‌థ‌కం జ‌న‌వ‌రి 9నే ప్రారంభించేందుకు జ‌గ‌న్ అధికారుల‌ను స‌మాయ‌త్తం చేశారు. నిజానికి ఇది కూడా రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారింది. అదేస‌మ‌యంలో ఈ నెల‌లోనే ఆరోగ్య శ్రీకార్డుల‌ను కూడా ప్రజ‌ల‌కు అందించాల‌ని నిర్ణయించారు. జ‌న‌వ‌రి 3న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ప్రారంభం కాబోయే ఆరోగ్య శ్రీకార్డుల పంపిణీ.. త్వర‌లోనే రాష్ట్ర వ్యాప్త అర్హుల‌కు కూడా చేర‌నుంది. ఇక‌, జ‌న‌వ‌రిలో సంక్రాంతి వ‌ర‌కు కూడా రోజుకో కార్యక్రమాన్ని జ‌గ‌న్ ప్రభుత్వం అమ‌లు చేస్తోంది.ఒకటో తేదీన అమ్మ ఒడి. 2న సంక్రాంతి తర్వాత మధ్యాహ్న భోజనంలో తీసుకొస్తున్న మార్పులు– నాణ్యతతో కూడిన ఆహారం దీనికి రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్న అంశాల‌పై చ‌ర్చ. 3న ఇంగ్లీషు మాధ్యంపై త‌ల్ల‌దండ్రులకు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం. 4వ తేదీన నాడు – నేడు పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, 9న అమ్మ ఒడి అమ‌లు .. ప‌ది నుంచి సంక్రాంతి సంబ‌రాలు నిర్వహించ‌డం ద్వారా కొత్త సంవ‌త్సరాన్ని జ‌గ‌న్ స‌రికొత్తగా ఆహ్వానించేందుకు ప‌క్కా ప్రణాళిక‌తో ముందుకు సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.