సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

సిరిసిల్ల జనవరి 7 (way2newstv.com)
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్  కృష్ణ భాస్కర్ అన్నారు. మంగళవారం పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా చందుర్తి మండలం రామారావు పల్లె గ్రామాన్ని కలెక్టర్ సందర్శించారు. వీధులను కాలినడక న తిరుగుతూ పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపు ను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పల్లె ప్రగతి కింద గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని అన్నారు. రెండో విడతలో గ్రామంలో మిగిలిన పనులను పూర్తి చేయాలని సూచించారు. మంజూరైన నిధులలో పది శాతం నిధులను పచ్చదనానికే వెచ్చించాలని సూచించారు. 
సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

గ్రామంలో బహిరంగ చెత్త వేస్తే జరిమానా విధించాలని తెలిపారు. డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటికల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.అనంతరం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శిం చారు. ఐదవ తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. తెలుగు సబ్జెక్ట్ లోని పాఠం ను చదవమని ఓ విద్యార్థిని కోరగా.....సదరు విద్యార్థి తడబాటు లేకుండా పాఠం ను చక్కగా చదివారు. విద్యార్థి పాఠం చదివిన తీరు కలెక్టర్ కు నచ్చింది. విద్యార్థి నీ శభాష్ అంటూ కలెక్టర్ అభినందించారు.పాఠశాలలో బోధన బాగుందం టూ ఉపాధ్యాయులను అభినందించారు. కలెక్టర్ రాకను పురస్కరించకుని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని అంగన్ వాడి విద్యార్థులు కలెక్టర్ కు స్థానికంగా లభించే పూల ను బహూకరిం చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీ రవీందర్, మండల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.