బాబు ఉత్తరాంధ్ర టూర్ రద్దు వెనుక - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బాబు ఉత్తరాంధ్ర టూర్ రద్దు వెనుక

విశాఖపట్టణం, జనవరి 1, (way2newstv.com)
చంద్రబాబునాయుడుకు ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే ప్రాణమని చెబుతారు. ఆయన టీడీపీని కూడా ఇక్కడ జనం నెత్తిన పెట్టుకుంటారు. తాజా ఎన్నికలు తప్పించి ఇప్పటివరకూ భారీ మెజారిటీలు, గౌరవప్రదమైన స్థానాలే టీడీపీకి దక్కాయి. ఇక చంద్రబాబు విషయానికి వస్తే వెనకబడిన ఉత్తరాంధ్ర అభివృధ్ధి తన లక్ష్యమని ఉమ్మడి ఏపీ సీఎం నుంచి నవ్యాంధ్ర సీఎంగా కూడా పదే పదే అదే మాట చెప్పుకుంటూ వచ్చారు. అటువంటి చంద్రబాబు ఉత్తరాంధ్ర టూర్ ని సడెన్ గా రద్దు చేసుకున్నారు. ఎందుకన్న దాని మీద రకరకాలుగా చర్చ సాగుతోంది. చంద్రబాబు తాను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తనకు వచ్చినన్ని అవకాశాలు మరెవ్వరికీ రాలేదు. మరి ఉమ్మడి ఏపీ సీఎం గా ఉండగా చంద్రబాబు చూపు అంతా హైదరాబాద్ మీదనే ఉంది.
 బాబు ఉత్తరాంధ్ర టూర్ రద్దు వెనుక

 నాడు విశాఖకు ఒక ఫ్లై ఓవర్ అడిగినా మంజూరు చేయలేదు అని ఆరోపణలు ఉన్నాయి. ఇక చంద్రబాబు ఐటీతో సహా అన్నీ హైదరాబాదే అన్నారు. ఆయన చుట్టపు చూపుగా నాడు విశాఖ పర్యటనలు వచ్చేవారు తప్ప లాంగ్ స్టాండింగ్ ప్రొగ్రామ్స్ కి శ్రీకారం చుట్టలేదు. ఇక ఇపుడు అమరావతే రాజధాని కావాలని చంద్రబాబు పట్టుపట్టుకుని కూర్చున్నారు.మూడు రాజధానులపై జగన్ ప్రతిపాదించిన తరువాత చంద్రబాబు అమరావతి అంటూ గొంతు చించుకోవడం పట్ల విశాఖ జనం నివ్వెరపోయారు. చంద్రబాబు హయాంలోనే విశాఖ రాజధాని చేస్తారని అనుకున్నామని, కానీ ఆయన అమరావతి అన్నారని, ఇక విశాఖను ఆర్ధిక రాజధాని చేస్తామని చెప్పినా ఉత్త ప్రకటనలే మిగిలాయన్న అసంత్రుప్తి కూడా జనంలో ఉంది. సరే ఇపుడైనా విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాలకు బాగుపడే అవకాశం వచ్చిందని సంతోషిస్తూంటే చంద్రబాబు మాత్రం అమరావతి అంటూ విశాఖపై విషం చిమ్మడం పట్ల మేధావులు సైతం విస్తుబోతున్నారు. దాంతో ఎక్కడలేని వ్యతిరేకత చంద్రబాబు మీద వచ్చిందని సొంత పార్టీ తమ్ముళ్ళే లోలోపల కలవరపడుతున్నారు.నిజానికి కొత్త ఏడాది జనవరి 3, 4 తేదీలలో చంద్రబాబు విశాఖ టూర్ ఉంది. ఆయన విజయనగరం జిల్లా సమీక్షల్లో పాలుపంచుకోవడానికి రావాల్సివుంది. అయితే హఠాత్తుగా టూర్ రద్దు అయిందని అంటున్నారు. దీని వెనక తమ్ముళ్ళు చంద్రబాబుకు ఉత్తరాంధ్ర జనాగ్రహం చెప్పి రావద్దు అనేశారని ప్రచారంలో ఉంది. అదెంతవరకు నిజమో తెలియదు కానీ ఒకపుడు తన సొంత గడ్డలా ఈ ప్రాంతానికి తరచూ వచ్చి వెళ్ళిన చంద్రబాబుకు ఇపుడు కాలు మోపడానికే ఇబ్బందిగా ఉందంటే పసుపు పార్టీ కధ ఎంతవరకూ వచ్చిందన్నది అర్ధం చేసుకోవాల్సిందేనంటున్నారు.మరో వైపు ఒకపుడు విశాఖ జనం జగన్ పార్టీని పక్కన పెట్టారు. నేడు అదే జనం జేజేలు పలుకుతున్నారు. థాంక్యూ సీఎం సార్ అంటూ ప్లే కార్డులు పట్టుకుని భారీగా వెల్ కం పలుకుతున్నారు. మా ప్రియతమ ముఖ్యమంత్రి అడగని వరాలే ఇస్తున్నారు అంటూ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. జగన్ కోసం 24 కిలోమీటర్ల మేర సిటీలో మానవహారం నిర్వహిస్తే పెద్ద ఎత్తున నగరవాసులు పాల్గొనడం జగన్ పట్ల పెరిగిన ప్రేమాభిమానాలకు నిదర్శనమని అంటున్నారు. ఇక జగన్ సైతం ఎన్నడూ లేని విధంగా 1250 కోట్లతో విశాఖలో పలు అభివృధ్ధి పధకాలకు శ్రీకారం చుట్టారు. రానున్న రోజుల్లో విశాఖ సిటీని మరింతంగా అభివ్రుధ్ధి చేసేందుకు కూడా గట్టి భరోసా ఇచ్చారు. మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబు అలా జగన్ ఇలా అని నగర వాసులు పోల్చి చూసుకోవాల్సివస్తోంది మరి.తప్పు ఎక్కడ..అమరావతి ని రాజధానిగా ప్రకటించేటప్పుడు గత ప్రభుత్వ అధినేత చంద్రబాబు వెనుకబడిన ప్రాంతాలకు వరాలు ప్రకటించారు. ఉత్తరాంధ్ర కేంద్రం విశాఖను నాలెడ్జ్ హబ్ గా చేస్తామని, రాయలసీమను పారిశ్రామికంగా తీర్చిదిద్దుతాం అంటూ చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు అదే ఫార్ములా వైసిపి ఉపయోగిస్తుంది. అమరావతిని నాలెడ్జ్ హబ్ చేస్తామంటూ గతంలో చంద్రబాబు విశాఖకు ఇచ్చిన హామీని తిప్పికొట్టింది వైసిపి సర్కార్. రాయలసీమ లో కూడా న్యాయ రాజధాని ఒక్కటే సరిపోదన్న ఆందోళన మొదలైంది.ఇప్పుడు రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల్లో ఒక చర్చ మాత్రం మొదలైంది. అదే ఇప్పుడు మాకేంటి అని ? మా ప్రాంతానికి ఈ సర్కార్ ఏమి చేస్తుందన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అమరావతి లోనే రాజధాని వుండాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మొదలు పెట్టడం లేదా అనుకూలంగా తీర్మానాలు చేయించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే అన్ని ప్రాంతాలవారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. తమ తమ ప్రాంతాల అభివృధ్ధికోసం గళం విప్పుతున్నారు. ప్రాంతాల వారీగా తమ కు దక్కాలిసిన వాటాను ఇవ్వలిసిందే అంటున్నారు.ఈ విషయంలో రాయలసీమ నుంచి గట్టిగా అక్కడి నేతల నుంచి గొంతు వినవస్తుంది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి, మైసూరా రెడ్డి, టిజి వెంకటేష్ వంటివారంతా సీమ సంగతి తేల్చాలని అనడం గమనిస్తే ఇప్పట్లో త్రిబుల్ కేపిటల్స్ పై మొదలైన వివాదం ఇప్పట్లో చల్లారేలా కానరావడం లేదు. అది గమనించే ఇటీవల సీమలో వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు కడప లో ముఖ్యమంత్రి శంఖుస్థాపనలు చేశారు. చేనేతలకు జగన్ అనంతపురం వేదికగా వరాలు కురిపించారు. ఇలా సీమ లో అలజడి రేగకుండా సీఎం ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా అక్కడ నిరసన జ్వాలలు శ్రీబాగ్ ఒప్పందం అమలు అంటూ గట్టిగానే అంతా ప్రశ్నిస్తున్నారు. ప్రాంతాల వారి వస్తున్న డిమాండ్ లను ఇప్పుడు సర్కార్ ఎలా సర్దుమణిగేలా చేస్తుందో చూడాలి.