అమరావతి జనవరి 20 (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ప్రారంభమైన తర్వాత రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టారు. మంత్రి మాట్లాడుతూ రాజధాని అమరావతి అంటూ సభకు తెలిపారు. పరిపాలన బాధ్యతలు అన్ని కూడా విశాఖలోనే నిర్వహిస్తామని స్పష్టం చేసారు.దీంతో పాటు సీఆర్డీఏను రద్దు చేస్తూ కూడా సభలో బిల్లు ప్రవేశ పెట్టారు.
అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన మంత్రి బుగ్గన
రాష్ట్రంలో ప్రత్యేకమైన జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుందని మంత్రి అన్నారు. అభివృద్ధి అనేది వివిధ ప్రాంతాలకు వికేంద్రీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇక జ్యుడీషియల్ బాధ్యతలు అన్ని కర్నూలు అర్బన్ డెవలప్ మెంట్ ఏరియా ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిదని అన్నారు. కర్నూలులో న్యాయపరమైన అన్నిశాఖలు ఏర్పాటు చేస్తామన్నారు. 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రాంతీయ అసమానతలు, సమాన అభివృద్ధి లేకపోవడం వల్లే రాష్ట్రంలో అశాంతికి దారితీస్తున్నాయన్నారు. ప్రజలెవరూ రాజభవనాలు కోరుకోరన్నారు. ఆంధ్రా అనే పదమే పాత పదమన్నారు. ఆంధ్రా తర్వాతే తెలుగు అనేపదం వచ్చిందన్నారు మంత్రి. తెలుగు భాష వలనే మనమంతా కలిసి ఉన్నామన్నారు.
Tags:
Andrapradeshnews